వెలుగుల పండుగ దీపావళిని భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్దమయ్యారు. నోములు, వ్రతాల కోసం అవసరమైన సామగ్రి కొనుగోలుకు పెద్దఎత్తున తరలిరావడంతో మార్కెట్లు రద్దీగా మారాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లకు పండుగ శోభ వచ్చింది. కిరాణా, పూజాసామగ్రి, పూలు, ప్రమిదలు, మట్టికుండలు తదితర వాటిని కొనుగోలు చేశారు. వీరికి అవసరమైన సామగ్రిని వ్యాపారులు ముందుగానే సిద్ధం చేసి ఉంచారు.
– పెద్దపల్లి/సుల్తానాబాద్రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


