సాక్షి, పెద్దపల్లి: ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బ యట అడుగుపెడితే.. గమ్యస్థానానికి చేరడం ఒక ఎత్తయితే.. పార్కింగ్ చేయడం మరోఎత్తు. షాపింగ్ చేయాలన్నా, బ్యాంకుకు వెళ్లాలన్నా, నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా పార్కింగ్ కోసం వీ ధులన్నీ వెతకాల్సిన దుస్థితి ఉంది. ఒకవైపు పెరుగుతున్న వాహనాల సంఖ్య, మరోవైపు రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ.. ఫలితంగా రామగుండం నగరంతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని పట్టణాల్లో రోడ్లు ఇరుకుగా మారతున్నాయి. పాదచారులకు దారే లేకుండా పోతోంది. జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్లు, బ్యాంకులు, వాణిజ్య సముదాయాల వద్ద పార్కింగ్‌కు స్థలం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇలా ప్రజా ధనం వృథా కావడంతోపాటు వాయు, శబ్ద కాలుష్యమూ పెరుగుతోంది.
శాశ్వత పరిష్కారం ఏది?
ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులు అ ప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించి హడావుడి చేస్తు న్నా. ఇదంతా కొద్దిరోజులకే పరిమితమవుతోందనే విమర్శలు ఉన్నాయి. ఒకసారి తొలగించిన ఆక్రమణలు మళ్లీ యథావిధిగా వెళ్తున్నాయి. జరిమానా విధించినా, హెచ్చరికలు జారీచేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. సమస్య శాశ్వత పరిష్కారానికి మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఫుట్‌పాత్‌లను పూర్తిగా పాదచారులకు అందుబాటులోకి తీసుకురావడం, వ్యాపారాలకు ప్రత్యేక ప్రాంతాలు కేటాయించడం, ప్రధాన కూడళ్ల వద్ద పార్కింగ్ స్థలాలను గుర్తించడం, అక్రమ నిర్మాణాలను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ఇది గోదావరిఖని లక్ష్మీనగర్
వ్యాపార కూడలి. ఫుట్‌పాత్‌లు, రోడ్ల
అంచుల వరకూ వ్యాపారాలు విస్తరించాయి. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మున్సిపల్ అధికారులు ఇటీవల ఓ దుకాణదారుకు రూ.10 వేల జరిమానా విధించినా మిగతావారికి హెచ్చరికగా పనిచేయలేదు. ఆక్రమణలు యథావిధిగా కొనసాగుతున్నాయి.


