రామగుండం: పట్టణంలో వంద పడకల ఈఎ స్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి ఎట్టకేలకు ముందడు గు పడింది. ఈఎస్‌ఐకి చెందిన 3.30 ఎకరాల్లో పనులు చేపట్టేందుకు ఎంప్లాయీస్ స్టేట్ ఇ న్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) కలెక్టర్‌కు లేఖ రాసింది. వీలైనంత త్వరగా సాంకేతిక అ నుమతులు, క్లియరెన్స్‌లు జారీచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదిత స్థలాన్ని ఈఎస్‌ఐసీ డైరెక్టర్ జనరల్ పేరిట ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు పేర్కొంది.
ధన త్రయోదశి జోష్
పెద్దపల్లిరూరల్: ధన త్రయోదశి సందర్భంగా బంగారం, వెండి కొనేందుకు వినియోగదారు లు ఆసక్తి చూపారు. శుక్రవారం ధన త్రయో దశి కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వినియోగదారులు వెండి, బంగారంతోపాటు, తమకు అవసరమైన ఆభరణాలను, చివరకు కొంతైనా వెండిని కొనేందుకు ఆసక్తిని కనబర్చారు. వ్యాపారులు సైతం వెండి చిన్నబిల్లలు కనీసం రూ.200 మొదలు, సిల్వర్‌కాయిన్, ఐదు, పది, 50, 100 గ్రాములు ఇలా రకరకాల సైజుల్లో సిద్ధం చేసి విక్రయించారు. అక్కడక్కడా కొందరు వ్యాపారులు డిజిటల్ పేమెంట్లను నిరాకరించడంతో కొనుగోలుదారులు నగదు కోసం కొంత ఇబ్బందులు పడ్డారు.
పరీక్ష కేంద్రం తనిఖీ
రామగిరి: టీజీపీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా పటిష్టమైన భద్ర తా ఏర్పాట్లు చేపట్టాలని అడిషనల్ డీసీపీ (పరిపాలన) శ్రీనివాస్ పోలీసు సూచించారు. మంథని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన టీజీపీఎస్సీ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం సందర్శించి పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రం వద్ద భద్రత ఏర్పాట్లు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని సీఐ స్వామి, రామగిరి ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఒక వరి పొలం.. మూడు హార్వెసర్లు
పెద్దపల్లిరూరల్: వరి సాగు చేసిన రైతులు ధా న్యం సేకరించేందుకు, హార్వెస్టర్‌తో పైరు కో యించేందుకు సిద్ధపడ్డారు. పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలో శుక్రవారం ఓ రైతు పొ లం కోసేందుకు హార్వెస్టర్ తెప్పించగా.. ఇటీవల కురిసిన వానలకు మడి కొంత తడిసింది. దీంతో హార్వెస్టర్ ముందుకు సాగలేదు. ప్ర త్యామ్నాయంగా చైన్‌సిస్టం ఉన్న హార్వెస్టర్లు తెప్పించి వరిపైరు కోయించాల్సి వచ్చింది.
ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా
పెద్దపల్లి: లింగ నిర్ధారణకు పాల్పడే ఆస్పత్రుల పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి పవిత్ర ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్ ఆ స్పత్రులపై నిఘా ఉంచాలని సూచించారు. అ దనపు కలెక్టర్ అరుణశ్రీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్ మాట్లాడుతూ వైద్య, ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బందికి చ ట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు చేశారు. డిప్యూటీ డెమో అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
1,204 క్వింటాళ్ల పత్తి కొనుగోలు
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం 1,204 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్టు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,652గా ధర నిర్ధారించగా.. కనిష్ఠ ధర రూ.8411గా, సగటు ధర రూ.8,561గా ఉందని ఆయన పేర్కొన్నారు.
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు
గోదావరిఖనిటౌన్: కార్తీకమాసం సందర్భంగా గోదావరిఖని నుంచి పుణ్యక్షేత్రాలకు సూపర్ లగ్జరీ బస్సు నడిపిస్తున్నామని డీఎం కవిత తెలిపారు. శ్రీశైలం మహాక్షేత్రానికి ఈనెల 10న బ స్సు ప్రారంభం అవుతుందని, ఇతర వివరాలకు 70135 04982, 73828 47596 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు.


