పెద్దపల్లి: క్రీడారంగాన్ని మ రింత బలోపేతం చేసేందు కు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ రూపొందించాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కోరారు. శాసనమండలిలో క్రీడారంగంపై శనివారం జ రిగిన చర్చలో పలు సూచనలు చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్రప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు, నిధులను వి నియోగించుకోవాలని కోరారు. మైసూర్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో సమగ్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలన్నారు.
డీజేలకు అనుమతిలేదు
గోదావరిఖని/గోదావరిఖనిటౌన్: సుంప్రీంకో ర్టు మార్గదర్శకాల మేరకే డీజేలకు అనుమతి ని రాకరించామని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి స్పష్టం చేశారు. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండ ప నిర్వాహకులతో కోదండ రామాలయంలో శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో డీసీపీ మాట్లాడారు. గోదావరిఖని ఇన్ చార్జి ఏసీపీ ప్రవీణ్‌కుమార్, సీఐ ఇంద్రసేనారెడ్డి, మండప నిర్వాహకులు పాల్గొన్నారు.
ముగిసిన ఖోఖో పోటీలు
పెద్దపల్లిరూరల్: అప్పన్నపేట జిల్లా పరిషత్ సెంకడరీ పాఠశాలలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఖోఖో పోటీలు శనివారం ముగిశాయి. ప్రతిభా చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, కుమార్, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ లక్ష్మణ్ తెలిపారు. ప్రతినిధులు వేల్పు ల సురేందర్, దాసరి రమేశ్, ప్రసాద్, నారాయ ణ, నరేశ్, కోటేశ్, షపీ, మధుకర్, తిరుపతి, భాస్కర్, కిశోర్, అంజలి, శిరీష పాల్గొన్నారు.
20న అథ్లెటిక్స్ పోటీలు
జ్యోతినగర్: ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌లో ఈనె ల 20న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.గట్టయ్య తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈనెల 18లోపు తమ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు అజయ్ : 99595 24375 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
పకడ్బందీగా రెస్క్యూ పోటీలు
గోదావరిఖని: సింగరేణి ఈనెల 23, 24వ తేదీ ల్లో నిర్వహించే 55వ జోనల్ మైన్స్ రెస్క్యూ పో టీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. రెస్క్యూ స్టేష న్‌లో పోటీలపై శనివారం సమీక్షించారు. సింగరేణితోపాటు హిందుస్థాన్ జింక్ నుంచి 4, మ హారాష్ట్ర గోల్డ్‌మైన్స్ నుంచి 2, హట్టి గోల్డ్‌మైన్స్, తమిళనాడు, తుమ్మలపల్లి కాంబినేషన్ బృందాలు పోటీల్లో పాల్గొంటాయన్నారు. సేఫ్టీ ఆఫీస ర్ సత్యనారాయణ, ఐఈడీ ఏజీఎం చంద్రశేఖర్, ఏరియా వర్క్‌షాప్ రాంరెడ్డి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ సునీల్‌ప్రసాద్, రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, సివిల్ ఎస్‌ఈ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయతకు ప్రతీక
పెద్దపల్లి: కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతు న్న ప్రస్తుత తరుణంలో తండ్రి ప్రేమను తలపోసుకున్న కవయిత్రి గజెల్లీ శ్రీలత కలం నుంచి వెలువడిన స్మృతి కవిత్వమే ‘బంగారు తండ్రి పుస్తకం’ అని జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్ అన్నారు. జిల్లా అధ్యక్షురాలు అనాసి జ్యోతి అధ్యక్షతన జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన పుస్తకావిష్కరణలో మా ట్లాడారు. తెలుగు అధ్యాపకురాలు గజెల్లీ శ్రీల త ‘నా బంగారు తండ్రి పుస్తకం’లో తండ్రి మ మకారాన్ని పంచారని ప్రశంసించారు. సాహితీవేత్త, కవి, విమర్శకుడు నారాయణశర్మ, రచయిత బుర్ర తిరుపతి, గజెల్లీ శ్రీలత, సామల కిరణ్, గంగుల శ్రీకర్, శ్రీదాస్యం లక్ష్మయ్య, కొ త్తకొండ సత్యనారాయణ, నన్నె నరేశ్, రమణారెడ్డి, రవికుమార్, మహేందర్ పాల్గొన్నారు.
నిలిచిన బొగ్గు ఉత్పత్తి
గోదావరిఖని: రెండ్రోజులుగా కురుస్తున్న వర్షా లతో సింగరేణి ఓసీపీల్లోని 18 ఓసీపీల్లో 1.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. క్వారీల్లోకి వర్షపు నీరు చేరుతోంది. నీటి మట్టం పెరగకుండా భారీపంప్‌ల ద్వారా అధికారులు శరవేగంగా పంపింగ్ చేస్తున్నారు.


