మంథని రూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామంలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు ఉంటా రు. అందరూ కలిసికట్టుగా ఒకేమాటపై నిలబడతారు. అందరికీ ఏదో ఒక కుటుంబ బంధం ఉంటుంది. ప్రతీ పండుగను కలిసి చేసుకుంటారు. 30ఏళ్లుగా గ్రామస్తులు ఒక్కతాటిపై నిలిచి ఒకే గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. గ్రామ నడిబొడ్డున విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి ఊరంతా కలిసి గోదావరినదిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1990లో నలుగురు వ్యక్తులు కలిసి గణనాథుడిని ప్రతిష్ఠించాలని ఆలోచన చేశారు. తొలుత తాటాకులతో మండపం వేశారు. అదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.


