వ్యవసాయ మార్కెట్‌ కమిటీగా ఎలిగేడు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మార్కెట్‌ కమిటీగా ఎలిగేడు

Sep 13 2026 12:18 AM | Updated on Sep 13 2026 12:18 AM

ఎలిగేడు: జిల్లాలో మరోవ్యవసా య మార్కెట్‌ ఏర్పాటైంది. ప్ర భుత్వ విప్‌ విజయరమణారావు సిఫారసు మేరకు ఆయన సొంత మండలం ఎలిగేడును వ్యవసాయ మార్కెట్‌గా ఏర్పాటు చే స్తూ జీవో నంబర్‌ 570 ద్వారా వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కమిటీ చైర్మన్‌గా పొట్యాల రమేశ్‌, వైస్‌ చైర్మన్‌గా కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, డైరెక్టర్లుగా పొన్నాల స్వామి, అమ్ముల శ్రీనివాస్‌, పూరెల్ల మల్లేశం, అప్పాల హరీశ్‌, గుడుగుల మహేందర్‌, కోడూరి రమేశ్‌, ఏలేటి మల్లారెడ్డి, మేచినేని ఆంనేయరావును నియమించింది. ఎలిగేడు ఇప్పటివరకు ధర్మారం వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో ఉండేది.

క్లిష్టమైన ఆపరేషన్లు విజయవంతం

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రిలో ఒకేరోజు క్లిష్టమైన ఆపరేషన్లు విజయవంతమయ్యా యి. మంథని మండలం గాజులపల్లికి చెందిన వ్యక్తి(75) ఎడమ మోకాలిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండగా తొలుత చీము తొలగించాక కుడితొడ నుంచి చర్యం తీసి మోకాలికి స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ చేశారు. ఎలిగేడు మండలం శివపల్లికి చెందిన వ్యక్తి(50) జ్వరం, వాంతులు, కళ్లు పచ్చబడటం, కడుపునొప్పితో రాగా.. కాలేయంలో చీము ఉన్నట్లు గుర్తించి శస్త్రచికిత్స లేకుండా అల్ట్రా సౌండ్‌ గైడెడ్‌ పిగ్‌టెయిల్‌ క్యాథెటరైజేషన్‌ ప్రక్రియ ద్వారా చీము తొలగించారు. జిల్లాలో ఈవిధానం తొలిసారి అని వైద్యులు తెలిపారు. ఓదెల మండలం కనగర్తికి చెందిన వ్యక్తి(75) మధుమేహంతో కాలి బొటనవేలు దెబ్బతిని, కణజా లం చెడిపోవడంతో ఆస్పత్రికి రాగా.. కణజాలం తొలగించడంతోపా టు ఇన్ఫెక్షన్‌కు గురైన మొదటి మెటాటార్సల్‌ ఎముకను విజయవంతంగా తొలగించారు. ప్లాస్టిక్‌ సర్జన్‌ అశోక్‌రెడ్డి, ఇంటర్వెన్షనల్‌ రేడియా లజిస్ట్‌ మొయినోద్దీన్‌, ఆర్థోపెడిక్‌, జనరల్‌ సర్జన్లు, అనెస్థీషియా, నర్సింగ్‌, ఆపరేషన్‌ థియేటర్‌ సిబ్బంది సమన్వయంతో చికిత్సలు నిర్వహించారు. వైద్యులను సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ అభినందించారు.

పొట్యాల రమేశ్‌

వెంకటేశ్వర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement