కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

Sep 13 2026 12:18 AM | Updated on Sep 13 2026 12:18 AM

పాలకుర్తి: ఏడాదిన్నర క్రితం చిన్నకుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపం చెందిన తండ్రి ఆరె లక్ష్మణ్‌ (52) బలన్మరణానికి ఒడిగట్టాడు. పో లీసుల కథనం ప్రకారం.. మారుతీనగర్‌(కీచులాటపల్లి)కి చెందిన ఆరె లక్ష్మ ణ్‌ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీలో కాంట్రాక్ట్‌ కార్మికుడు. ఇతడికి భార్య ఇద్ద రు కుమారులు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం చిన్నకుమారుడు అజయ్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి తీవ్ర మనోవేదనతో ఉంటున్న లక్ష్మణ్‌ విధులకు సరిగ్గా వెళ్లడంలేదు. మద్యానికి బానిసయ్యాడు. కొడుకు మరణించడాన్ని జీర్ణించుకోలేక శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దకుమారుడు మ హేందర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ ఎదుట నిరసన

మంథని: ఎన్నికల హామీ మేర కు వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫమైందని ఆరోపిస్తూ బీజేపీ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద రైతులతో కలిసి ఆందోళన చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా మాజీ అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి, నాయకులు చల్లా నారాయణరెడ్డి, కొండపాక సత్యప్రకాశ్‌, మచ్చగిరి రాము, నాంపల్లి రమేశ్‌, వీరబోయిన రాజేందర్‌, సబ్బాని సంతోష్‌, కొయ్యడ సతీశ్‌, పగే రంజిత్‌, కొండ్రు లక్ష్మణ్‌, ఎల్కా సదానందం, రాపర్తి సంతోష్‌, మట్ట శంకర్‌, మల్లారపు అరుణ్‌, చిలువేరు సతీశ్‌, విశ్వాతేజ, సామల అశోక్‌, భానుప్రకాశ్‌, తొట్ల రాజు, రైతులు సాదుల రమేశ్‌, జాన్నే శ్రీనివాస్‌, రాజు, ఓదెలు, వెంకటేశ్‌, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement