కోరుట్లటౌన్: కోరుట్లలోని గాంధీరోడ్డులో గల పద్మశాలీ సంఘ భవనంలో 52 ఏళ్లుగా ఏటా ఇత్తడి గణపతి ప్రతిష్ఠాపన ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇత్తడి గణపతిని దర్శించుకునేందుకు కోరుట్లతో పా టు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. సుమా రు 52ఏళ్ల క్రితం మట్టి దొరకని కరు వు పరిస్థితుల్లో విగ్రహం తయారీకి ఇబ్బందులు ఎదురయ్యా యి. దీంతో అప్పటి పద్మశాలీ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మద్రాసు నుంచి ఇద్దరు శిల్పులను కోరుట్లకు రప్పించి పంచలోహాలతో గణపతి విగ్రహాన్ని తయారు చేయించారు. అప్పటి నుంచి నేటి వరకు అదే విగ్రహానికి పూజలు చేస్తున్నారు. నవరాత్రులు ముగిసిన అనంతరం ఇత్తడి గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పవిత్ర జలాలను విగ్రహంపై చల్లి తిరిగి పద్మశాలీ సంఘం భవనానికి తీసుకువచ్చి భద్రపరుస్తారు.


