మంథని: మంత్రపురిలో 110 ఏళ్లుగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నా రు. స్థానిక బ్రా హ్మణ సామాజికవర్గం వంటలు చేసేందుకు నాగ్‌పూర్‌కు వెళ్లేవారు. అక్కడి సంప్రదాయాన్ని మంథనికి తీసుకొచ్చి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. నాగ్‌పూర్, మంథని మినహా దేశంలో ఎక్కడా సిద్ధి..బుద్ధి(భార్యలు) విగ్రహాలతో గణేశ్ దర్శనం లభించదు. మంథని పెంజేరుకట్ట హనుమాన్ ఆలయంలో సిద్ధి, బుద్ధి గణపతి ఉత్సవాలను 1916 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. మోతారాం గారి రాజేశ్వర్‌రావు, టక్కేగారి మల్లన్న, మంథని లింగయ్య ఆధ్వర్యంలో ఆనాడు ఉత్సవాలు జరిగేవి. నడివీధిలో 1918 నుంచి నిర్వహిస్తున్నారు. మందాట వీధిలో గత 65 ఏళ్లుగా అఖండ గండదీపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.


