ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

Aug 25 2026 1:27 AM | Updated on Aug 25 2026 1:27 AM

పెద్దపల్లిరూరల్‌: విద్యార్థులకు బకాయిపడ్డ ఫీ జురీయింబర్స్‌మెంట్‌ వెంటనే చెల్లించాలని బీ జేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్‌ చేశారు. ‘ఫీజుబకాయి – బీజేపీ లడారు’ పేరిట ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చేపట్టే నిరాహారదీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమని ఆ యన పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును నిరసి స్తూ సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల హక్కులు కాలరాసేందుకు యత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, అ నుబంధ సంఘాల నాయకులు పెంజర్ల రాకేశ్‌, వేల్పుల రమేశ్‌, ప్రదీప్‌కుమార్‌, మహేందర్‌యాదవ్‌, కాసగోని నిర్మల, బెజ్జంకి దిలీప్‌కు మార్‌, చిలుక భారతి, శివంగారి సతీశ్‌, బూత గడ్డ రాజ్‌కుమార్‌, రామగిరి అఖిల్‌, శ్రీనివాస్‌, రేండ్ల వేణు, తీగల అశోక్‌, సంతోష్‌, సతీశ్‌, రాజేందర్‌రెడ్డి, ఉమేశ్‌ తదితరులున్నారు.

వినియోగదారులకు మెరుగైన సేవలు

పెద్దపల్లిరూరల్‌: వినియోగదారులకు నాణ్యమై న విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ గంగాధర్‌ అన్నారు. రాగినేడు 33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నుంచి బసంత్‌నగర్‌ 33 కేవీ సబ్‌స్టేషన్‌ వరకు 8.5 కి.మీ. పొడవున ఏర్పా టు చేసిన ఇంటర్‌ లింకింగ్‌ లైన్‌ను సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈమేరకు ఆ ప్రాక్రియ ప్రారంభించారు. ఏ దైనా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో అంతరాయం కలిగితే.. ప్రత్యామ్నాయంగా సరఫరా పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుందని, ఈలైన్‌ ద్వా రా మూడు సబ్‌స్టేషన్‌లకు విద్యుత్‌ కారిడార్‌ లా పనిచేస్తుందని అన్నారు. పెద్దపల్లి, మంథని డీఈఈలు రాజబ్రహ్మచారి, ప్రభాకర్‌, శ్రీనివాసరెడ్డి, మల్లేశం తదితరులు ఉన్నారు.

ఎస్‌ఐఆర్‌ రెండోదశపై సమీక్షించిన ఎమ్మెల్యే

కోల్‌సిటీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం(ఎస్‌ఐఆర్‌) రెండోదశ ప్రక్రియపై రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ నగరంలోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. సర్‌ పురోగతిపై బాధ్యులు, కార్పొరేటర్లతో ఆయన చర్చించారు. ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేశ్‌, కార్పొరేటర్లు, ఎస్‌ఐఆర్‌ బాధ్యులు పాల్గొన్నారు.

సోదరభావంతో ఉండాలి

కోల్‌సిటీ: మీలాద్‌ ఉన్‌ నబీని శాంతియుత వా తావరణం, సోదరభావంతో జరుపుకోవాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. పెద్దపల్లి, మంచిర్యాల జి ల్లాలకు చెందిన ముస్లిం మత పెద్దలతో సీపీ తన కార్యాలయంలో సోమవారం పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. వేడుకల ఏర్పాట్లు, ర్యాలీలు, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ఇందులో చర్చించారు. ఎలాంటి అవాంఛనీ ఘటనలు చోటుచేసుకున్నా, పోలీసుల సేవల కోసం డయల్‌ 112, కమిషనరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 87126 56597 నంబర్లను సంప్రదించాలని కమిషనర్‌ సూచించారు. అదనపు డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, ఏసీపీలు నాగేంద్రగౌడ్‌, ప్రకాశ్‌, సీఐలు ప్రవీణ్‌కుమార్‌, కృష్ణకుమార్‌, శ్రీనివాసరావు, భీమేశ్‌, ఆర్‌ఐ రమేశ్‌, పెద్దపల్లి ఎస్‌ఐలు నరేశ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, శ్యామ్‌పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement