సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణకు సంబంధించిన నిధుల వివరాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రాథమిక (పీఎస్), ప్రాథమికోన్నత (యూపీఎస్), ఉన్నత పాఠశాలలు (హెచ్‌ఎస్), కేజీబీవీ/ మోడల్ స్కూళ్లు, జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలు/కేంద్రాల విభాగాల్లోని 2,205 విద్యాసంస్థలకు సంబంధించి నిర్వహణ నిధులు విడుదలయ్యాయి. పాఠశాలల్లో మైనర్ రిపేర్లకు, తాగునీటి సదుపాయాలు, ల్యాబ్‌లు, లైబ్రరీల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన కోసం ఈ గ్రాంట్‌ను కేటాయించారు. విద్యార్థుల సంఖ్య (స్లాబ్‌లు) ఆధారంగా హెడ్‌మాస్టర్లు, ఎంఈవోలు, డీఈవోల స్పర్మ్ అకౌంట్లలో ఈ నిధులు నేరుగా జమకానున్నాయి. ఇందులో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు, పీఎంశ్రీ పాఠశాలలకు ఈ గ్రాంట్ వర్తించదు.
బడికి నిధుల భరోసా
Aug 25 2026 1:27 AM | Updated on Aug 25 2026 1:27 AM
● ఉమ్మడి జిల్లాలో 2,205 స్కూళ్లకు రూ.5.71 కోట్ల గ్రాంట్
● ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఈ గ్రాంటే కీలకం
● అత్యధిక నిధులు జగిత్యాలకు, అత్యల్పంగా సిరిసిల్లకు
● పాఠశాలల వారీగా కేటాయింపు పూర్తి
● పాత జిల్లాలో మొత్తం 1,85,888 మంది విద్యార్థులు
● జీరో ఎన్రోల్మెంట్, పీఎంశ్రీ పాఠశాలలకు ఈ గ్రాంట్ వర్తించదు జిల్లా సమగ్ర గణాంకాలు:
Advertisement


