ఆకలి తీర్చేందుకే అల్పాహారం | - | Sakshi
Sakshi News home page

ఆకలి తీర్చేందుకే అల్పాహారం

Aug 25 2026 1:27 AM | Updated on Aug 25 2026 1:27 AM

● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ● సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ ప్రారంభం

మంథని: విద్యార్థులు ఆకలితో పాఠశాలకు వెళ్లకుండా నాణ్యమైన పౌష్టికాహారం అందించి విద్యపై ఏకా గ్రత పెంచే లక్ష్యంతోనే సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్‌బాబు తెలిపారు. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా ల్లోని సుమారు 40 వేల మందికి దీనిద్వారా ప్రయో జనం చేకూరుతుందన్నారు. మంథని గంగాపురిలో సింగరేణి నిర్మించిన సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ను సోమవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. హరే కృష్ణ మూమెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ సమన్వయంతో ఆహార భద్రత కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అనంతరం రూ.2.55 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఆర్డీవో సురేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ సయేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకన్న, విద్యుత్‌ నియంత్రణ మండలి సలహా కమి టీ సభ్యుడు శశిభూషణ్‌ కాచే, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, ఆర్జీ–3 జీఎం మధుసూదన్‌, హరే కృష్ణ ట్రస్ట్‌ అధ్యక్షుడు సత్యగౌరచంద్రదాస, సీఈవో కౌన్తేయదాస, ఎస్‌ఈ గంగాధర్‌ తదితరులు ఉన్నారు.

తహసీల్దార్‌ కార్యాలయ భవనం ప్రారంభం

కమాన్‌పూర్‌: మండల కేంద్రంలో నిర్మించిన తహసీల్దార్‌ కార్యాలయ భవవనం, శ్రీఆదివరాహస్వామి ఆలయ రహదారి, సీసీ రోడ్లను మంత్రి శ్రీధర్‌బా బు ప్రారంభించారు. రాజాపూర్‌ బండలవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తొట్ల తిరుపతియాదవ్‌, తహసీల్దార్‌ వా సంతి పాల్గొన్నారు. సిద్దిపల్లె సర్పంచ్‌ కల్యాణి.. మంత్రికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

గుజరాత్‌ సీఎంకు అనుమతి ఏమిటి?

అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన విశ్వవిద్యాలయాలు, కళాశాలను తెలంగాణకు తీసుకొచ్చే యత్నంలో సీఎం రేవంత్‌రెడ్డి లండన్‌, అమెరికా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైతే భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడం బాధాకరమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఏటా వందలాది మంది విద్యార్థులు తెలంగాణ నుంచి విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్నారని, ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ స్థాయి విద్య ఇక్కడే ఉండేలా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement