గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను సర్పంచులు పర్యవేక్షిస్తే మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సర్పంచులకు అదనపు బాధ్యతలు అయినా కేంద్రాల నిర్వహణ బాగుంటుంది. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం సక్రమంగా అందిస్తారు.
– దండెవేన సంధ్య – బానేశ్,
సర్పంచ్, గుంజపడుగు
ప్రభుత్వ నిర్ణయం సరైనదే
అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ప్రతీగ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం పర్యవేక్షణ బాధ్యత సర్పంచ్‌కు అప్పగించడం చాలా మంచిది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలు మరింత మెరుగుపడతాయి. అంగన్‌వాడీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించేలా పర్యవేక్షణ చేస్తాం.
– ఎరవెల్లి కృష్ణవేణి – నరేశ్‌రావు,
సర్పంచ్, దుబ్బపల్లి


