పెద్దపల్లి: ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు ఎంపికై న 12 మంది గురువారం జిల్లా యువజన, క్రీడాధికారి సురేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ శ్రీహర్షను కలిశారు. కలెక్టర్ అభినందించి జిల్లాలో ఎంపికై న బాలికల పూర్తి ఖర్చులు చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో గో ఫ్లై డైరెక్టర్ విశ్వరూపిణి, వ్యాయామ ఉపాధ్యాయులు కుమార్, ఉద్యోగం పొందిన అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నాగవెళ్లి పట్నం
జూలపల్లి: మండలంలోని కాచాపూర్‌లో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీమల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామికి నాగవెళ్లి పట్నం వేశారు. ప్రతీ యాదవ సంఘ సభ్యుడు ఇంటి నుంచి బోనాలను శోభాయాత్రగా తీసుకొచ్చి పట్నంపై పెట్టి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఒగ్గు కళాకారులు మలికార్జున స్వామి కల్యాణం జరిపించి, జీవిత చరిత్రను ఒగ్గు కథగా చెప్పడం ఆకట్టుకుంది. యాదవ సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కొత్త సాగు ప్రారంభం
కాల్వశ్రీరాంపూర్: ఉగాది పండుగ రోజు రైతులు కొత్త సాగు ప్రారంభించడం అనవాయితీగా వస్తోంది. వేద పండితులు చెప్పిన విధంగా కొందరు రైతులు తమ రాశులు, నక్షత్రం ప్రకారం వ్యవసాయ పనులు ప్రారంభిస్తుండగా.. మరికొందరు ఉగాది రోజు ప్రారంభిస్తారు. పంట పొలంలో తుమ్మలు, పొరకలు, పత్తి చెట్లు గొడ్డలితో నరికి వేస్తారు. ఇలా గొడ్డలి ఉపయోగించి తుమ్మలు తొలిగించడమే కొమ్మ కొట్టడం అని పిలుస్తారు. కొమ్మ కొట్టడంతో వ్యవసాయ పనులు ప్రారంభమైనట్లే. వీలు చూసుకుని ఎరువు తోలడం, దున్నడం చేస్తారు.
విగ్రహ ప్రతిష్ఠకు మంత్రి రూ.3,00,116 విరాళం
ధర్మారం: ధర్మారం మండలం నందిమేడారంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న గంగమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్ రూ.3,00,116 విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని గురువారం ధర్మారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరిగె లింగయ్య చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం నాయకులు సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
వెలుగులు పంచాలి
జ్యోతినగర్: శ్రీపరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రజలందరికీ వెలుగులు పంచాలని ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. గురువారం పర్మినెంట్ టౌన్‌షిప్ జ్యో తిక రిక్రియేషన్ క్లబ్ మ్యూజిక్ హాలులో ఏర్పా టు చేసిన ఉగాది వేడుకల్లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు రుధ్రభట్ల శ్రీకాంత్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. జీఎంలు ముకుల్‌రా య్, మనీష్ అగర్వాల్, కార్పొరేటర్ కవితారె డ్డి, ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్, ఎన్టీపీసీ ఉ ద్యోగ గుర్తింపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, సాగర్ రాజు, ఐఎన్‌టీయూసీ నా యకులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


