మంథని: విశ్వబ్రాహ్మణులు తమ ఆచారం ప్రకారం ప్రతీఉగాది పండుగ ముందు వచ్చే అమావాస్య నుంచి మూడురోజులపాటు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో బుధవారం కూడా ప్రత్యేక పూజలు చేశారు. అడవిలో లభించే తీగదారి పుష్పాలతో మండపాలను ప్రత్యేకంగా తయారు చేసుకున్నారు. అందులో వీర బ్రహ్మేంద్రస్వామి చిత్రపటం, పనిముట్లను ఉంచారు. మూడు రోజులపాటు విశేష పూజలు చేయనున్నారు.
తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిగా ఎస్.కుమార్
గోదావరిఖని: తమిళ నాడు రాష్ట్ర బీజేపీ ఎన్ని కల కో ఇన్‌చార్జిగా రా మగుండం ప్రాంతానికి చెందిన ఎస్.కుమార్‌ను నియమించారు. బుధవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. త మిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎ న్నికలను పురస్కరించుకుని ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్‌సింగ్‌ఆర్య ఉత్తర్వు లు జారీచేశారు. తమిళనాడు, పశ్చిమబెంగా ల్, అసోం, పుదుచ్చేరి, కేరళం రాష్ట్రాలకు కూ డా ఎస్సీ మోర్చా తరఫున ప్రభారీ, సహ ప్ర భారీలను నియమించారు. ఇందులో భాగంగా తమిళనాడుకు ప్రభారీగా శంభునాథ్‌తుండియా, సహ ప్రభారీలుగా ఎస్.కుమార్, మాజీ ఎంపీ మునిస్వామిని నియమించారు.
రాజకీయ కక్షతోనే దాడి
ఎలిగేడు: బుర్హాన్‌మియాపేటకు చెందిన రజకుడు చంద్రగిరి పరశురాములుపై అగ్రవర్ణ వ్యక్తులు రాజకీయ కక్షతోనే దాడిచేశారని తె లంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూ సాల సంపత్ కుమార్ ఆరోపించారు. బా ధిడుతు పరశురాములును బుధవారం సంపత్‌కుమార్ పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొమ్మెర ఘటన మరువక ముందే బుర్హాన్‌మి యాపేటలో పోచమ్మకు మొక్కులు చెల్లించు కుని ఇంటికి చేరుకున్న పరశురాములును కు లం పేరుతో దూషించి దాడి చేయడం దు ర్మార్గమన్నారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితుల అరెస్ట్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు జోక్యం చేసుకోరాదని ఆయన కోరారు. నాయకులు గంగిపెల్లి శంకర్ పొన్నం శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ‘సంప్రదాయం’
యైయెటింక్లయిన్‌కాలనీ: ఉగాది పండుగను పురస్కరించుకొని జల్లారంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు బుధవారం సంప్రదా య దుస్తులతో విధులకు హాజరయ్యారు. సి బ్బంది అందరూ ఒకేరకమైన రంగులతో కూ డిన దుస్తులు ధరించి కనిపించడంతో ఖాతా దారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వా త వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చీఫ్ మేనేజర్ సంజయ్ కుమార్, ఉద్యోగులు విజయభాస్కర్, రాములు, దీపక్, దినేశ్, ప్రసన్న, శ్రీకాంత్, మణికంఠ, దుర్గారావు, విజయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
పెద్దపల్లి: పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని డీఈవో శారద తెలిపారు. మొత్తం 7,489 మంది విద్యార్థులకు 7,480 మంది హాజరయ్యారని, 99.9 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు.
‘విజన్‌లేని నివేదిక’
ధర్మారం: ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదికకు విజన్ లేదని తపస్ జి ల్లా ప్రధానకార్యదర్శి జగన్ విమర్శించారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో జగన్ మాట్లాడా రు. మురళి అందించిన రిపోర్టు విద్యా వ్యవస్థ ను భ్రష్టు పట్టించేలా ఉందని ధ్వజమెత్తారు. నివేదిక రూపొందించే ముందు క్షేత్ర స్థాయి లో పనిచేసే ఉపాధ్యాయుల అభిప్రాయాల ను పరిగణనలోకి తీసుకుని సమీక్షించుకోవా లని సూచించారు. తపస్ మండల అధ్యక్షుడు గుర్రాల గంగారెడ్డి, బాధ్యులు వనపర్తి అంజ య్య, జైపాల్‌రెడ్డి, శశిధర్, సతీశ్, శ్రీనివాస్‌రె డ్డి, ఉమాశంకర్, శ్రీనివాస్,ప్రశాంత్ ఉన్నారు.


