Sakshi News home page

'ఎస్‌ఆర్‌ఆర్‌ నుంచే నా రాజకీయ జీవితం' : పొన్నం ప్రభాకర్‌

Published Thu, Dec 14 2023 12:26 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రంలోనే ఉమ్మడి కరీంనగర్‌ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల అని, రాజకీయ ఉద్ధండులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, జువ్వాడి చొక్కారావు, ఎమ్మెస్సార్‌, జి.వెంకటస్వామి, జైపాల్‌రెడ్డి నుంచి అక్షరాలు నేర్చుకున్నానని చెప్పా రు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బుధవారం పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌ వచ్చారు.

నగరంలోని ఇందిరాచౌక్‌లో ఏర్పాటు చేసిన వి జయభేరి సభలో ఆయన మాట్లాడుతూ సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి టి.జీ వన్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సహకారంతో ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతామన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, తమది చేతల ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం మారిందని, అధికారులు కూడా వ్యవస్థను మార్చుకోవాలని సూచించారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని, తాను కరీంనగర్‌ బిడ్డనన్నారు.

ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా, రాష్ట్ర అ ధ్యక్షుడిగా, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా పనిచేశానన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో కరీంనగర్‌ ఎంపీ అయ్యానన్నారు. తన రాజకీయ గురువు జువ్వాడి చొక్కారావు 1973లో రవాణా శా ఖ మంత్రి అయితే, చొక్కారావు శిష్యుడినైన తాను 2023లో రవాణాశాఖ మంత్రి అయ్యానన్నారు. తా ను 1987లో రాజకీయ జీవితం ప్రారంభించానని, ఈ 36 ఏళ్లలో ఎక్కడా అవినీతికి తావులేదని, ఎలాంటి ఆరోపణలు లేవన్నారు.

కొంతమంది చేతగాక పార్టీలు మారినోళ్లు తనను విమర్శిస్తే, భగవంతుడు ఒక్క అవకాశం ఇస్తాడని చెప్పానంటూ గుర్తు చేసుకున్నారు. తాను పార్టీ మారలేదని కాంగ్రెస్‌ అంటే పొన్నం, పొన్నం అంటేనే కాంగ్రెస్‌ అని స్పష్టం చేశారు. తనకు ప్రజల ఆశీర్వాదమే టానిక్‌ అ ని, కేసీఆర్‌ వాడే టానిక్‌ కాదంటూ చమత్కరించా రు. ఎంపీగా తాను పార్లమెంట్‌లో తెలంగాణ కో సం కొట్లాడి, మా ఎంపీ పొన్నం అని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా చేశానన్నారు. మానకొండూరు ఎ మ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించి ప్రజల ఆశలు నెరవేర్చిన నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

తన పార్లమెంట్‌ పరిధిలో నాలుగు స్థానాలు గెలిపించుకున్నానని తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం మాట్లాడుతూ నియంతృత్వ ప్రభుత్వం కూలి పోయి, ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పొన్నం ప్రభాకర్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం శుభసూచకమన్నారు. కార్యక్రమంలో కరీంనగర్‌, హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీలు పురుమల్ల శ్రీనివాస్‌, వొడితెల ప్రణవ్‌, నాయకులు వైద్యుల అంజన్‌కుమార్‌, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మెనేని రోహిత్‌రావు, మంజులారెడ్డి, కటకం వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

దారిపొడవునా నీరాజనం!
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్‌, అనుబంధ విభాగాలు, పొన్నం అభిమానులు, కుల, బీసీ సంఘాలు ఘనస్వాగతం పలికా యి. ఎమ్మెల్యేలు క వ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి ఓపెన్‌టాప్‌ వాహనంలో నగరానికి చేరుకున్న పొన్నం ప్రభాకర్‌కు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన స్వాగత వేదికల వద్ద పూలవర్షంతో నీరాజనం పట్టారు. ఎన్‌టీఆర్‌ విగ్రహం నుంచి కోతిరాంపూర్‌, కమాన్‌చౌరస్తా, సిక్‌వాడీ, శ్రీపాదచౌక్‌ మీదుగా ఇందిరాచౌక్‌ వరకు అడుగడుగునా స్వాగతం పలికారు.

కోలాటాలు, నృత్యాలు, డప్పు వాయిద్యాలతో మ హిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గొల్లకురుమలు గొంగడితో సత్కరించారు. సిక్‌లు కరవాలం బహుకరించారు. ఆర్టీసీ కార్మికులు గజ మాలతో సన్మానించారు. ఇందిరాచౌక్‌ వద్ద విజయభేరి సభ ముగిసిన తరువాత పొన్నం ప్రభాకర్‌ ర్యాలీగా డీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నాయకులతో సమావేశమయ్యారు. నాయకులు కట్ల సతీశ్‌, కొడూరి రవీందర్‌గౌడ్‌, మునిగంటి అనిల్‌, దన్ను సింగ్‌, ఖమర్‌, సిరాజొద్దిన్‌, మొహమ్మద్‌ అమీర్‌, బోనాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
ఇవి చ‌ద‌వండి: రెగ్యులర్‌ కమిటీ లేనట్టేనా? ఇంత‌కీ చైర్మ‌న్ ఎవ‌రు?

Advertisement

What’s your opinion

Advertisement