విజయనగరం రూరల్: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ ఈ నెల 21 వరకు చేపట్టనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి, ఎకై ్సజ్ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బొగ్గులదిబ్బ వద్దనున్న పట్టణ ఎకై ్సజ్ స్టేషన్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి ఆధ్వర్యంలో మద్యం లైసెన్స్‌దారులతో దుకాణాల రెన్యువల్ ప్రక్రియపై శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీ శ్రీనివాసచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 21 సాయంత్రం 5 గంటలలోపు మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆలోపే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు ఈ ఏడాది మద్యం దుకాణాల రెన్యువల్‌కు ప్రభుత్వం జీవో 579 జారీ చేసిందని వివరించారు. ఈ జీవోను అనుసరించి జిల్లాలో ఓపెన్ కేటగిరి, గీత కార్మికులకు సంబంధించి మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఓపెన్ కేటగిరిలో 153 మద్యం దుకాణాలు ఉండగా, గీత కార్మికులకు సంబంధించి 16 మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. 50 వేల జనాభా కలిగిన ప్రాంతాల్లోని 17 ఓపెన్ కేటగిరి మద్యం దుకాణాలకు వార్షిక రుసుం రూ. 60.50 లక్షలు, ఆర్‌ఈటీ రెన్యూవల్ ఫీజు రూ.23 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.5 లక్షలతో కలిపి రూ.88.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లోని 136 ఓపెన్ కేటగిరి దుకాణాలకు వార్షిక ఫీజు రూ.71.50 లక్షలు, రెన్యూవల్ ఫీజు రూ.27.20 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.5 లక్షలతో మొత్తంగా రూ.1.06 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలోని గీత కులాల మద్యం దుకాణాలకు జనాభా ప్రాతిపదికన ఫీజులు నిర్ణయించినట్టు తెలిపారు. 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలకు వార్షిక ఫీజు రూ.30.30 లక్షలు, ఆర్‌ఈటీ రెన్యువల్ ఫీజు రూ.11.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.5 లక్షలతో కలిపి రూ.46.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 50 వేల నుంచి 5 లక్షలలోపు జనాభా కలిగిన ప్రాంతాల్లోని 14 దుకాణాలకు వార్షిక ఫీజు రూ.35.80 లక్షలు, రెన్యూవల్ ఫీజు రూ.13.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.5 లక్షలతో మొత్తంగా రూ.56.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత లైసెన్స్‌దారులు ఈ నెల 21లోపు రెన్యువల్ చేసుకోవాలని ఆయన తెలిపారు. రెన్యువల్ చేసుకోని మద్యం దుకాణాలకు ఈ నెల 22 నుంచి 29 వరకు కొత్త దరఖాస్తులు స్వీకరించి, ఈ నెల 30న లాటరీ విధానం ద్వారా అర్హులైన వారికి మద్యం దుకాణాలు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను లైసెన్స్‌దారులు పూర్తిగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, అసిస్టెంట్ ఎకై ్సజ్ అధికారి ఎస్.దొర, జిల్లాలోని వివిధ స్టేషన్ల సీఐలు, ఏ – 4 దుకాణాల లైసెన్స్‌దారులు పాల్గొన్నారు.


