జాతీయ లోక్‌ అదాలత్‌ సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

జాతీయ లోక్‌ అదాలత్‌ సక్సెస్‌

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

జాతీయ లోక్‌ అదాలత్‌ సక్సెస్‌

జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత

అదాలత్‌లో 7051 కేసులు పరిష్కారం

విజయనగరం లీగల్‌; రాజీయే రాజ మార్గమని కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహ పూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకై క మార్గం లోక్‌ అదాలత్‌ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎం.బబిత అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌ అదాలత్‌కు హాజరై న్యాయమూర్తి మాట్లాడారు. ఈ లోక్‌ అదాలత్‌ వలన కక్షిదారులకు సమయం, డబ్బు వృధా కాకుండా వారి జీవితాలలో ప్రశాంతత కలిగి ఉంటారన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో పలు సివిల్‌, క్రిమినల్‌ కేసులు, రాజీ పడదగిన కేసులను రాజీ మార్గంలో ఇరు పార్టీల సమ్మతితో శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌ ఉమ్మడి జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలోని కోర్టులైన విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో మొత్తంగా 7051 కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. వాటిలో సివిల్‌ కేసులు 162, క్రిమినల్‌ కేసులు 6866, ప్రీ లిటిగేషన్‌ కేసులు 23 ఉన్నాయన్నారు. ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెందిన 9,73,16,602 లక్షల రూపాయలు మోటార్‌ ప్రమాద బీమా కేసులో పిటిషనర్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు. జాతీయ లోక్‌ అదాలత్‌కు హాజరైన కక్షిదారులకు సీనియర్‌ న్యాయవాదులు పీఏఎన్‌ రాజు, పంపాన రవికుమార్‌, కుమార్‌ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి చైర్మన్‌ దుర్గయ్య, కుటుంబ న్యాయ స్థానం అదనపు జిల్లా న్యాయమూర్తి ఓ.విజయ కళ్యాణి, బి.అప్పలస్వామి, నాల్గవ శ్రేణి అదనపు న్యాయమూర్తి, శ్రీధర్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి రమేష్‌నాయుడు, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్‌, ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ శ్రీనివాసరావు, జూనియర్‌ సివిల్‌ జడ్జి బుజ్జి, మొబైల్‌ కోర్ట్‌, సెకండ్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.ఖతేజా చక్రవర్తి, ఫస్ట్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి, ఇజి.శ్రీ విద్య, మూడవ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి, నలితం రమేష్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బెల్లాన రవి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు, కోర్టు సిబ్బంది, వివిధ శాాఖల అధికారులు, పోలీస్‌, ఇన్సూరెన్సు అధికారులు, బ్యాంకు మేనేజర్లు, న్యాయ వాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement