నేత్రదానం దేవుడిచ్చిన వరం | - | Sakshi
Sakshi News home page

నేత్రదానం దేవుడిచ్చిన వరం

Aug 25 2026 1:03 AM | Updated on Aug 25 2026 1:03 AM

నేత్రదానం దేవుడిచ్చిన వరం

పార్వతీపురం రూరల్‌: అంధుల పట్ల కేవలం సానుభూతి చూపడం కన్నా.. వారికి చూపుని చ్చే నేత్రదానం చేయడ మే అత్యుత్తమమని జిల్లా నేత్ర వైద్య అధికారి డాక్టర్‌ నగేష్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది కంటి చూపునకు నోచుకోక చీకట్లో మగ్గుతుండగా, ప్రతి ఐదు సెకన్లకూ ఒకరు అంధులవుతున్నారన్నారు. వీరిలో 7.1 శాతం మంది కేవలం కార్నియా (నల్లగుడ్డుపై మచ్చలు) సమస్యలతోనే చూపు కోల్పోతున్నారని, ఆధునిక వైద్య శాస్త్రంలో ’కా ర్నియా గ్రాఫ్టింగ్‌’ అనేది ఒక అద్భుత వరంగా పేర్కొన్నారు. మనిషి చనిపోయిన ఆరు గంట లలోపు కార్నియాను సేకరించి, 24 గంటలలోగా అంధులకు అమర్చడం వల్ల కంటి చూపు ను ప్రసాదించవచ్చని వివరించారు. నేత్రదానంపై ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ నెల 25 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు ‘ 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సంద ర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సు లు, చైతన్య ర్యాలీలు ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. 80 శాతం అంధత్వాన్ని నివారించే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్క రూ మరణానంతరం నేత్రదానం చేసి అంధుల జీవితాల్లో నవ వసంతం నింపాలని నగేష్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

‘రికార్డు’ స్థాయిలో జానపద కళాకారుల ప్రదర్శన

బొబ్బిలి: పట్టణంలో ఈ నెల 22న 330 మంది జానపద కళాకారులతో నృత్యాలు, ర్యాలీ ప్రదర్శనను జీనియస్‌ బుక్‌, గోల్డెన్‌ బుక్‌లు గుర్తించాయి. గిన్నిస్‌ బుక్‌ ప్రదర్శనకు అర్హత సర్టిఫికెట్‌లు అందజేశాయి. దీనిపై కళాకారులు కోల బలరాం, మరిపి శంకరరావు, చుక్క కూర నా యుడు, బి.మధుసూదనరావు, గొట్టాపు సన్యాసినాయుడు, తెర్లి పద్మ, పి. సత్యం, ఎం.రమేష్‌ హర్షం వ్యక్తంచేశారు. సర్టిఫికెట్లను ఎమ్మెల్యే బేబినాయనకు సోమవారం అందజేశారు.

నేడు రాష్ట్ర అధికార భాషా

సంఘం అధ్యక్షుని రాక

విజయనగరం టౌన్‌: రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.త్రివిక్రమరావు ఈ నెల 25న మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారని తెలుగు భాషా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని 25న తెలుగు సాహిత్య సాంస్కృతిక వైభవం పేరుతో తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సన్‌ స్కూల్‌లో నిర్వహిస్తున్న ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులను

రెగ్యులర్‌ చేయాలి

విజయనగరం ఫోర్ట్‌: డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌హెల్త్‌ (డీఎంఈ), డైరెక్టర్‌ ఆఫ్‌ సెకెండరీ హెల్త్‌ (డీఎస్‌హెచ్‌), డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (డీపీహెచ్‌)లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఏపీ మెడికల్‌, హెల్త్‌ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి వెంకటరమణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అల్లు పద్మజకు వినతిపత్రం అందజేశారు. రెగ్యులరైజేషన్‌ పక్రియ పూర్తయ్యేవరకు కాంట్రాక్టు ఉద్యోగులకు 100 శాతం గ్రాస్‌ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో మరణించిన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఈపీఎఫ్‌ సౌకర్యం, అనార్యోగానికి గురైన ఉద్యోగులకు పూర్తిజీతంతో కూడిన సెలవులు ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement