● సాగులో ‘రత్నం’ | - | Sakshi
Sakshi News home page

● సాగులో ‘రత్నం’

Aug 25 2026 1:03 AM | Updated on Aug 25 2026 1:03 AM

చిత్రంలో పొలం పనిలో నిమగ్నమైన వృద్ధురాలిని చూశారా... ఈమె పేరు ఆరిక రత్నాలమ్మ. వయస్సు 90 సంవత్సరాలు. కురుపాం మండలం జరడ గిరిజన గ్రామం. ఇటీవల కురిసిన వర్షాలకు పొలంలో నీరు చేరడంతో ఉభాలకు దమ్ముచేయించారు. దానిని నాట్లు వేసేందుకు వీలుగా ఓ చేతిలో కర్ర పట్టుకుని కాలితో చదును చేస్తూ...కుటుంబ సభ్యులకు సాగు‘సాయం’ అందించింది. పుడమితల్లి మురిసేలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది. సరిలేరు నాకెవ్వరూ అంటూ రైతుల్లో స్ఫూర్తినింపింది. కష్టపడితే ఆరోగ్యం, ఆనందం సమకూరుతుందని, పంటలు పండితే ఎవరి వద్ద చేయిచాపాల్సిన అవసరం ఉండదని ఆమె సెలవిచ్చింది. – కురుపాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement