ఉత్సాహంగా 1600 మీటర్ల ట్రయల్‌ రన్నింగ్‌ పోటీ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా 1600 మీటర్ల ట్రయల్‌ రన్నింగ్‌ పోటీ

Aug 17 2026 1:05 AM | Updated on Aug 17 2026 1:05 AM

ఉత్సాహంగా 1600 మీటర్ల ట్రయల్‌ రన్నింగ్‌ పోటీ

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): గరివిడి పట్టణంలోని రతన్‌చంద్‌ నగర్‌ ప్రాంగణంలో నేతాజీ ఫిట్‌నెస్‌ అకాడమీ, ఎస్‌ఆర్‌జే డిఫెన్స్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 1600 మీటర్ల ట్రయల్‌ రన్నింగ్‌ పోటీ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. యువతలో క్రీడాస్ఫూర్తితో పాటు శారీరకదారుఢ్యం, క్రమశిక్షణ, పట్టుదల వంటి లక్షణాలను పెంపొందించి, యువతను రక్షణ రంగంలో ఉద్యాగాల వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పోటీ నిర్వహించారు. ఈ పోటీలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో ప్రతిభను చాటిన పాచిపెంటకు చెందిన బి.సాయి ప్రథమస్థానం, పాచిపెంటకు చెందిన ఎం.హరీష్‌ ద్వితీయస్థానం, కోడూరుకు చెందిన ఎల్‌.బాలకృష్ణ తృతీయస్థానం సాధించారు. విజేతలకు డీఎస్పీ ఎస్‌.రాఘవులు బహమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌డీఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ లెఫ్ట్‌నెంట్‌ సురేష్‌కుమార్‌, మంత్రి హరికృష్ణ, కోచ్‌లు స్వరూప్‌, వేణు, సత్యనారాయణ,ధనుంజయ్‌,త్రినాథ్‌, అకాడమీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement