అలనాటి జ్ఞాపకాలు.. ఆ నాణాలు | - | Sakshi
Sakshi News home page

అలనాటి జ్ఞాపకాలు.. ఆ నాణాలు

Aug 18 2026 12:57 AM | Updated on Aug 18 2026 12:57 AM

శ్రద్ధగా సేకరిచిన ఈశ్వర రావు

బలిజిపేట: ప్రతి వ్యక్తిలో పాత జ్ఞాపకాలు ఒక ముఖ్య ఘట్టం. వాటిని పునస్మరణ చేసుకోనివారు ఉండరు. సమాజానికి సంబంధించిన పాత జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చేవారు కొందరే ఉంటారు. అటువంటి వారిలో బలిజిపేట గ్రామవాసి ఆనాల ఈశ్వరరావు ఒకరు. ఆయనకు 68సంవత్సరాలు. ఆయన గత 40సంవత్సరాల నుంచి అవకాశం ఉన్నంత మేరకు అలనాటి జ్ఞాపకాలకు సంబంధించిన వివిధ రకాల నాణాలు, కరెన్సీని సేకరించడం అలవాటుగా పెట్టుకున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ అందుబాటులో ఉండేవి, ఇతరుల వద్ద ఉన్నవాటిని అడిగి తీసుకుని దాచడం, ఇతర దేశాల్లో ఉండే స్నేహితుల నుంచి కరెన్సీ సేకరించడం అలవాటుగా పెట్టుకున్నారు. ఇప్పటికీ అదేపనిగా ఆయన సేకరిస్తున్నారు. ఆయన సేకరించిన వాటిలో రాగి, వెండి, సాధారణ నాణాలు ఉన్నాయి. 1818నాటి రకరకాల కాయిన్స్‌ నుంచి మనకు తెలిసిన పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు వంటి కాయిన్స్‌ను జాగ్రత్తగా ఉంచారు. తాత, తండ్రుల కాలం నాటి నుంచి ఉండే వివిధ రకాల రాగి, వెండి కాయిన్స్‌ను ఆయన జాగ్రత్తగా ఉంచడం విశేషం.

చాలావరకు రాగి నాణాలు

ఈశ్వర రావు దగ్గర రాగి నాణాలు ఎక్కువగా ఉన్నాయి. 1818నాటి లక్ష్మీదేవితో, రామపట్టాభిషేకం, 1842నాటి కనకదుర్గ, 1862నాటి వివిధ రకాల గుర్తులతో ఉండే రాగి నాణాలు చాలావరకు ఉన్నాయి. అలాగే బ్రిటిష్‌ కాలంనాటి విక్టోరియా రాణి, జార్జికింగ్‌ ముఖ చిత్రాలతో ఉండే రాగి కాయిన్స్‌ ఉన్నాయి. ఇంకా జార్జి 6వ కింగ్‌, జార్జి ఎంపరర్‌ వెండి నాణాలు, 1980నాటి ఎలిజబెత్‌–2ముఖ చిత్రంతో ఉండే వెండి నాణెం ఉన్నాయి.

స్వదేశానికి

సంబంధించి..

స్వర్గీయ ఇందిరాగాంధీ, నెహ్రూ తదితర ముఖ చిత్రాలతో ఉండే నాణాలు ఆయన దగ్గర ఉన్నాయి.

చిల్లర నాణాలు

మన చిన్న నాటి నాణాలు ఇప్పటికే మనం మరిచిపోయి ఉంటాం. అటువంటి వాటిని ఆయన దాచి ఉంచడం విశేషం. ఇప్పటి జనరేషన్‌కు పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు, రకరకాల 10పైసల నాణాలు తెలిసిన దాఖలాలు లేవు. అటువంటి నాణాలు రకరకాలవి ఆయన సేకరించి ఉంచారు. అదేవిధంగా రూపాయి, రెండు రూపాయల నోట్లు కనిపించడం లేదు. అటువంటివి ఆయన దగ్గర కనిపిస్తున్నాయి. అదేవిధంగా 10రూపాయలు, 100రూపాయల నోట్లు రకరకాలవి కనిపిస్తున్నాయి. ఆయన వద్ద ఉన్న రకరకాల నాణాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

విద్యార్థులకు తెలియపరచాలని ఉంది

వివిధ రకాల నాణాలు, కరెన్సీని పాఠశాలలో విద్యార్థులకు చూపించి పాతకాలంలో ఉండే వివిధ రకాల నాణాల ప్రాధాన్యతను వారికి తెలియపరచాలని భావిస్తున్నాను. పాత తరాలకు చెందినవి విద్యార్థులకు తెలియడం ఎంతో అవసరం. – ఈశ్వరరావు, బలిజిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement