● ప్రత్యేక బలగాల ముమ్మర తనిఖీలు
పార్వతీపురం రూరల్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతమైన పార్వతీపురం మండలంలో గల గోచెక్క గ్రామం జంక్షన్ పోలీసులు, ప్రత్యేక బలగాలు సంయుక్తంగా ముమ్మరంగా వాహనాల తనిఖీలు సోమవారం నిర్వహించారు. సరిహద్దుల గుండా సాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే ప్రధాన ధ్యేయంగా ఈ తనిఖీలు సాగాయి. మార్గమధ్యంలో రాకపోకలు సాగించే ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిఘాను తీవ్రతరం చేశారు. వాహన తనిఖీలతో పాటు ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందుజాగ్రత్త చర్యగా డ్రోన్ కెమెరాల సహాయంతో పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టేందుకు ఈ తరహా ముమ్మర తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై తెలిపారు.


