న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026
వారేమి చేశారు పాపం..!
చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగుల పట్ల కూడా వివక్ష ప్రదర్శిస్తోంది. దివ్యాంగుల్లో కూడా తమ పార్టీ వారా? ప్రతిపక్ష పార్టీ వారా?
అని చూస్తోంది.
సాక్షి, పార్వతీపురం మన్యం :
పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ పట్టణాల్లో సుమారు 1,60,000 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడున్న వార్డుల పరిధిలో దాదాపు 13,130 కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా కలుషిత నీరే వస్తోంది. తరచూ రంగుమారిన, బురదతో కూడిన నీరు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత సీజన్లో రోగాలు వ్యాప్తి ఎక్కువని.. ఇటువంటి నీటిని తాగితే ఎందుకు వ్యాధులు ప్రబలవని పట్టణ ప్రజలు వాపోతున్నారు. పార్వతీపురం, పాలకొండ పట్టణాలకు తాగునీటిని అందించడానికి నాగావళి నదిలో భూగర్భ బావులు నిర్మించారు.
పురాతనమైన ఈ బావుల్లో కలుషిత నీటిని ఇంకించే ఫిల్టర్ విధానం లేక బురద నీటినే విడుదల చేస్తున్నారు. నదిపై నిర్మించిన తోటపల్లి జలాశయ పథకం గేట్లు ఎత్తితే బురద వస్తోంది. దానినే రిజర్వాయర్లలో నింపి, కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు.
గిరిజన ప్రాంతాలకు సైతం స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్న మంత్రి
సంధ్యారాణి
గిరిజన గూడలే కాదు.. మైదానాల్లోనూ తాగునీటి ఎద్దడి
జిల్లా కేంద్రంలోనే బురద నీటితో ప్రజలు ఇక్కట్లు
గిరిశిఖర గ్రామాల్లో తాగునీటికి
నిత్యకష్టాలు
ఇవన్నీ కాదని మంత్రినోట అబద్ధపు మాట
కళ్లుతెరిచి మా తాగునీటి సమస్యలు చూడండి అంటున్న గిరిజనులు


