పాలకొండ రూరల్/సీతంపేట/భామిని:
● పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలంలో 512కుపైగా గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో సుమారు 30 గ్రామాల ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. కొండ శిఖర గ్రామాల్లో శాశ్వత పరిష్కారం లేదు. వేసవిలో కొండ శిఖర గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. గుక్కెడు నీటికోసం గెడ్డలు, వాగులపై ఆధారపడతారు. ఎగువదారబ గ్రామస్తులు ఎప్పటి నుంచో తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నా నేటికి పరిష్కారం లేదు. సందిగూడ, ఎగువద్వారబంధం, రంగంవలస, నడిమిద్వారబందం, బేడరాయి తదితర గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. బోర్లు, బావులు వంటివి వేయడానికి ఆయా గ్రామాల్లో సాధ్యం కాని పని. గ్రావిటేషన్ విధానంలో నీటిని అందించాలి.
● పాలకొండ మండలం ఓని పంచాయతీ పరిధి కొత్త ఊరు, వెలగవాడ పంచాయతీలోని గదబవలస, సింగన్నవలస పంచాయతీలో మల్లమ్మగూడ, డోలమడ పంచాయతీ పరిధిలోని వంతవాడ గిరిజన గ్రామాల్లో రక్షిత పథకాలు లేవు. ప్రత్యామ్నాయ వ్యవస్థ నడుస్తోంది.
● భామిని మండల పరిధి కడంబసింగి, గేదలగూడ, నడిమిగూడ తదితర గిరిజన గ్రామాల్లో తాగునీరు లేక అక్కడి మహిళలు సుదూర పాంత్రాలకు వెళ్లి నేల, ఊట బావుల నుంచి నీటిని సేకరిస్తున్నారు.
ఏజెన్సీల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. దీంతో పలు గ్రామాల ప్రజలు గెడ్డలపై ఆధారపడుతున్నారు. వేసవిలో పూర్తిగా నీరు ఉండదు. ట్యాంకర్లతో నీరు సరఫరా చేయడం లేదు. వర్షాలు పడితే గెడ్డల్లో నీరు తాగడం వల్ల వైరల్ జ్వరాలు, పలురకాల వ్యాధుల బారిన పడుతున్నాం. – వి.చలపతిరావు, మాజీ సర్పంచ్, మర్రిపాడు, సీతంపేట మండలం.
●


