● తాగాలన్నా భయమే.. | - | Sakshi
Sakshi News home page

● తాగాలన్నా భయమే..

Aug 12 2026 3:10 AM | Updated on Aug 12 2026 3:10 AM

బురద నీరే దిక్కు..

జియ్యమ్మవలస రూరల్‌/గుమ్మలక్ష్మీపురం: కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండలం పెదతోలుమండ, చిలకం గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ గ్రామాల్లోని కుళాయిల నుంచి వచ్చే నీరు బురద మయంగా ఉంటోంది. తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు ఆయా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు.

మా గ్రామంలో రక్షిత మంచి నీటి పథకం ట్యాంక్‌ పాడవ్వడంతో కొద్ది రోజుల నుంచి మోటార్‌ నీటిని నేరుగా కుళాయిలకు సరఫరా చేస్తున్నారు. దీంతో నీరు బురదమయంగా ఉంటోంది. ఆ నీటిని తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు వినియోగించాలంటే భయం వేస్తోంది.

– మండంగి అప్పారావు, పెద తోలుమండ గ్రామస్తుడు. జియ్యమ్మవలస మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement