కొమరాడ: మండలంలోని ఎండభద్ర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. చిన్నారులను వంట కలప తెచ్చే పనిమనిషులుగా వినియోగిస్తున్నారు. వంట కలప మోస్తున్న చిన్నారుల వీడియోలు సోషల్‌మీడియాలో శనివారం హల్‌చల్ చేయడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు. చదువుకునేందుకు పిల్లలను పంపిస్తే కట్టెలు తెచ్చేందుకు అడవికి పంపించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే పాఠశాల సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపించారు. సుమారు 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో కట్టెల పొయ్యిపై వంటలు చేయడం, కట్టెలు తెచ్చేందుకు చిన్నారులను వినియోగించడం సరికాదని, వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ కడ్రక వెంకటరావు డిమాండ్ చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ పాలనలో పేదకుటుంబాల పిల్లలకు చదువు కష్టాలు తప్పడంలేదని తల్లిదండ్రులు నిట్టూర్చుతున్నారు.
● మారని ఎండభద్ర ఆశ్రమపాఠశాల సిబ్బంది తీరు
● పట్టించుకోని ఉన్నతాధికారులు


