
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: కంటకాపల్లి, కొత్తవలస రైల్వే లైన్‌లో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నామని ప్రభుత్వ రైల్వే ఎస్సై బాలాజీరావు సోమవారం తెలిపారు. మృతుడికి సుమారు 30నుచి 35 ఏళ్ల వయస్సు ఉంటుందని సుమారు 5 అడుగుల 6 అంగుళాల పొడవు ఉంటాడన్నారు. చామన ఛాయ రంగుతో ఉన్న మృతుడు ఎరుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్, లైట్ గ్రే కలర్, నీలం రంగు గల షార్ట్‌తో ఉన్నాడన్నారు. ఆ వ్యక్తిని గుర్తు పట్టినట్లయితే ఫోన్ 9490617089, 6301365605 నంబర్‌లకు కానీ జీఆర్పీ ల్యాండ్‌లైన్ నంబర్ 08912883218కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
గంట్యాడ: మండలంలోని మదనాపురంగ్రామానికి చెందిన లగుడు సురేష్ (40) గ్రామంలోని ముని అక్కమ్మ చెరువులో పడి మృతి చెందాడు. సోమవారం ఉదయం 7:30 గంటల సమయంలో కలువు పువ్వులు తీసుకోవడానికి చెరువులోకి ఈదుకుంటూ వెళ్లాడు. చెరువు మధ్యలోకి వెళ్లిన తర్వాత లోతు ఎక్కువుగా ఉండడంతో నీటిలో మునిగి ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
కూలిన ఇంటి గోడ
కొమరాడ: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కొమరాడ మండలంలోని పరుశురాంపురంలో సోమవారం వేకువజామున ఐదు గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన కొత్తకోట బాలకృష్ణ పాత్రుడు, సత్యనారాయణ పాత్రుడుల పాత ఇంటి గోడ కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని స్థానికులు తెలిపారు. అధికారులు తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.
బహిరంగంగా
మందు కొడితే చర్యలు
● ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరిక
విజయనగరం క్రైమ్: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పనని ఎస్పీ వకుల్ జిందల్ మరోసారి సోమవారం మందుబాబులను హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మందుబాబులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ న్యూసెన్స్ చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని, పట్టుబడిన మైనర్లు, మందుబాబులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులకు ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లేఅవుట్లు, గ్రామ శివారు, నగర శివారు ప్రాంతాల్లో, బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై పోలీసు అధికారులు, సిబ్బంది డ్రోన్లతో దాడులు నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 1520 కేసులు నమోదు చేశామన్నారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం