
డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
తొలి రోజు తప్పని సర్వర్ డౌన్
ఇబ్బందులు
సెలక్షన్ సమాచార ప్రకటనలో గోప్యం
బహిరంగంగా ప్రకటించకపోవడంతో అభ్యర్థుల్లో అసంతృప్తి
తొలి రోజున 398 మంది ధ్రువపత్రాల పరిశీలన
ఉమ్మడి విజయనగరం జిల్లాలో
ఖాళీలు 583
విజయనగరం అర్బన్:
డీఎస్సీ–2025 సెలక్షన్ జాబితా జిల్లా అభ్యర్థు ల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ డెంకాడ మండ లం మోపాడలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో గురువా రం ప్రారంభమైంది. సెలక్షన్ జాబితాను బహిరంగంగా ప్రకటించకుండా ఎంపికై న అభ్యర్థుల వ్యక్తిగత మెయిల్స్‌లో మాత్రమే పంపడం వల్ల సెలక్షన్ కాల్స్ రాని మంచి ర్యాంకుల అభ్యర్థులు కూడా కొందరు పరిశీలన కేంద్రానికి రావడం కనిపించింది. గతంలో జరిగిన అన్ని డీఎస్సీల్లోనూ సెలక్షన్ జాబితాను తొలిత బహిరంగంగా ప్రకటించేవారు. పోస్టుకు కటాఫ్ మార్కులపై అభ్యర్థులకు ఆ విధా నం నుంచి స్పష్టత లభించేదని అభ్యర్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత డీఎస్సీ సెలక్షన్ జాబితా ప్రకటించిన విధానంపై పలువురు అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తొలి రోజున తప్పని
సర్వర్ డౌన్ సమస్యలు
ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించిన తరువాత ఉదయం పూట పూర్తిగా సర్వర్ డౌన్ ఇబ్బందులు తప్పలేదు. దీని కారణంగా ఇటు పరిశీలన బృందం, అభ్యర్థులు నిరీక్షించాల్సి వచ్చింది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో వివిధ కేటగిరిల కింద 583 టీచర్ పోస్టులకు డీఎస్సీ–2025 నోటిఫికేషన్ విడుదల అయింది. వాటి భర్తీకి సంబంధించిన ప్రక్రియలో భాగంగా చేపడుతున్న రెండు రోజుల ధ్రువపత్రాల పరిశీలనలో తొలి రోజున 398 మంది అభ్యర్థుల పరిశీలన పూర్తయింది. వీరిలో రెండు, అంతకంటే ఎక్కువ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులు తొలి ప్రాధాన్యత పోస్టులకే పరిమితం అయ్యారు. ఇలాంటి అభ్యర్థుల కారణంగా మిగిలిన పోస్టులకు తర్వాత ర్యాంకర్లకు ఈ రోజే కాల్ లెటర్స్‌ని వ్యక్తిగత సమాచారంగా పంపుతారని డీఈవో యు.మాణిక్యంనాయుడు తెలిపారు. రెండో రోజు కేటాయించిన 182 పోస్టులతో పాటు వీరికీ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో
భర్తీ చేస్తున్న పోస్టులు 583
ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో వివిధ కేడర్ ఉపాధ్యాయ పోస్టుల ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ యాజమాన్యాల పాఠశాలలకు చెందిన పోస్టులు 446, ట్రైబుల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో మరో 137 పోస్టులు నోటిఫికేషన్‌లో ఉన్నాయి. అదే విధంగా జోన్–1 (నాలుగు ఉమ్మడి జిల్లాల) పరిధిలో భర్తీ చేసే ఏపీఆర్‌ఎస్/ఏపీఎంఎస్/ఏపీఎస్‌డబ్ల్యూ/బీసీవెల్ఫేర్/ట్రైబుల్ వెల్ఫేర్ తదితర సంక్షేమ సంస్థల గురుకులాల జోన్‌ల స్థాయి పోస్టులు ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ కేటగిరి పోస్టులు 400 వరకు ఉన్నాయి.

డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన