
పార్వతీ తనయా.. పాహిమాం...
వినాయక చవితి ఉత్సవాలు పార్వతీపురం పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ రూపాల్లో గణనాథులు కొలువుదీరారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన భారీ వినాయక ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పార్వతీపురం పట్టణంలోని కొత్తవలసలో 21 అడుగుల ఎత్తులో మొక్కజొన్న పొత్తులతో ఏర్పాటు చేసిన గణనాథుడు ప్రత్యేకంగా భక్తులను ఆకర్షించాడు. తెలుగు వారి తొలి పూజ వినాయక చవితిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వినాయక మండపాల వద్ద భక్తులు తొలి రోజు బారులు తీరారు.
– పార్వతీపురం టౌన్