చంద్రబాబిచ్చే ఇరవైలచ్చల ఉద్యోగాల్లో వాడికొకటైనా రాకపోతుందా అని మా పెద్దమనవడు ఒకటే ఎదురు చూపులు గణేశా.. పోనీ అందాక నెలకు ఇస్తామన్న మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి అయినా వస్తే బాగుణ్ణు.. జేబు ఖర్చులకు వచ్చేదని ఆశపడ్డాడు. అయినా చంద్రబాబును నమ్మితే నిరాశ తప్ప ఇంకేం ఉండదని తెలియని వెర్రి నాగన్న నా మనవడు.. వాణ్ని నువ్వే చూసుకోవాలి గణేశా.. మా యమ్మికి అప్పట్లో జగనన్న ఉన్నప్పుడు ఆసరా డబ్బులొచ్చేవి.. ఇప్పుడు అవన్నీ దుకాణం సర్దేశాడు చంద్రబాబు.. ఇక బాబును నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో అన్నట్లుగా తయారైంది మా బతుకు. అయినా అన్నీ తెలిసినవాడివి నీకేం చెప్పగలను.. స్వామి!