
తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేద పేతురాజ్(Nivetha Pethuraj). త్వరలో వివాహం చేసుకోబోబుతున్నట్లు ప్రకటించేశారు.

ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా ఫోటోలు షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే వారికి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.

నివేదకు కాబోయే భర్త పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్.. అతను దుబాయ్‌లో బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. కొంతకాలంగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు.

అయితే, ఈ విషయం బయటిప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఏకంగా ఎంగేజ్‌మెంట్ తర్వాత అందరికీ శుభవార్త చెప్పారు. ఇదే ఏడాదిలో వారి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.















