
వినాయక పూజకు వేళాయె..
పార్వతీపురంటౌన్: వినాయక పూజకు వేళయింది. పల్లెలు, పట్టణాలు సందడిగా మారాయి. వీధివీధినా వెలసిన మంటపాలు, విద్యుత్ దీపాల అలంకరణలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. పల్లె నుంచి పట్టణం దాకా... మురికివాడల నుంచి ఖరీదైన అపార్ట్‌మెంట్ల వరకు ఎవరి స్థాయిలో వారు అంబరాన్నంటేలా బుధవారం జరుపుకునే విఘ్నేశ్వర పూజకు సర్వం సిద్ధం చేశారు. వినాయక విగ్రహాలు, ప్రతిమలు, పూజాసామగ్రిని మంగళవారం కొనుగోలు చేసి వాహనాల్లో మంటపాలకు తరలించారు. పర్యావరణ స్పృహతో పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి ప్రతిమలను పంపిణీ చేశాయి. పార్వతీపురం మార్కెట్‌లో చవితి సందడి కనిపించింది. పత్రి, పండ్లు, పూలు, వినాయక వ్రత పుస్తకాల అమ్మకాలు జోరుగా సాగాయి.

వినాయక పూజకు వేళాయె..