
● పొలం బాట...
వర్షాలు కురుస్తుండడంతో ఓ వైపు ఉభాలు... మరోవైపు వరి చేలలో కలుపుతీత పనులు ఊపందుకున్నాయి. పల్లె ప్రజలు ఉదయాన్నేలేచి క్యారేజీలు పట్టుకుని పొలంబాట పడుతున్నారు. పొద్దుకుంకేవరకు పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. మహిళా కూలీలకు డిమాండ్ పెరిగింది. వరి చేలలో కలుపుతీత పనులకు రోజుకు రూ.250 నుంచి రూ.300 వరకు కూలి గిట్టుబాటవుతోంది. గుంపులు గుంపులుగా పొలాలకు చేరుకుంటున్నారు. దీనికి పాలకొండ–వీరఘట్టం రోడ్డులో పొలంబాట పట్టిన మహిళల చిత్రమే సజీవ సాక్ష్యం. – పాలకొండ రూరల్