
మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025
న్యూస్‌రీల్
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు పెద్దింటి శివప్రసాద్. పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామనివాసి. ఈయన ఆధార్‌కార్డు వివరాల్లో వేరేవరిదో 25 ఎకరాల భూమి లింకు అయిపోయింది. ఆ భూమి తనది కాదని, తొలగించాలని సచివాలయం, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పటికే రెండు సార్లు కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశాడు. తిరగడమే తప్ప ఫలితం ఉండడం లేదు. తాజాగా మరోసారి అధికారులను కలిసి వేడుకున్నాడు. అంత భూమి ఉండటం వల్ల ప్రభుత్వ పథకాలేవీ అందుకోలేకపోతున్నానని చెబుతున్నాడు. ఆ భూమిని తన పేరిట తొలగించాలని కోరుతున్నాడు. లేకుంటే మొత్తంగా తన పేరు మీదే రాయించేసి, సదరు భూమిని అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025