
వీవీఆర్ పేటను పార్వతీపురంలో విలీనం చేయాలి
వంగర: మండలంలోని వి.వి.ఆర్.పేట పంచాయతీని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేయాలని గ్రామస్తులు కోరారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా రామమందిరం వేదికగా శుక్రవారం సమావేశమయ్యారు. తమ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో పార్వతీపురం జిల్లా కేంద్రం ఉందని, ప్రస్తుతం ఉన్న విజయనగరం 110 కిలోమీటర్లు దూరంలో ఉందని వెల్లడించారు. రానుపోను దూరం 220 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. నిత్యం వైద్యం, వ్యాపార, వాణిజ్య అవసరాలకు పార్వతీపురం వెళ్తుంటామని, పాలన పరంగా తమకు అనుకూలమని వెల్లడించారు. సమస్యను అవసరమైతే అమరావతిలోని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళదామని వారంతా నిర్ణయించారు.