డేంజర్‌ స్నాక్స్‌..! | - | Sakshi
Sakshi News home page

డేంజర్‌ స్నాక్స్‌..!

Aug 18 2025 6:29 AM | Updated on Aug 18 2025 6:29 AM

డేంజర

డేంజర్‌ స్నాక్స్‌..!

అధికారులు చర్యలు చేపట్టాలి నాసిరకం ఆహారంతో ప్రమాదం

మీరూ పరిశీలించండి

వీరఘట్టం: ఇటీవల కాలంలో చిన్న పిల్లల వైద్యుల వద్దకు రెగ్యులర్‌గా వస్తున్న పలు కేసులను పరిశీలిస్తే.. గ్యాస్ట్రిక్‌, కడుపులో నొప్పి, వాంతులు... ఇలా బయటపడుతున్నాయి. పిల్లలకు ఎందుకిలా ఈ విధమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పరిశీలిస్తే.. ఎక్కువగా రసాయనాలు, అధికంగా కారం, సాల్ట్‌ ఉన్న నాసిరకం చిరుతిళ్లు(స్నాక్స్‌) తినడం వల్లేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇటువంటి కేసులే చిన్నారుల్లో వెలుగు చూస్తున్నాయి. దీన్ని తల్లిదండ్రులు అంత సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో బాల్యంలోనే చిన్నారుల శారీరక పెరుగుదల మందగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారుల పాలిట చిరుతిళ్లు తయారు చేసే కంపెనీలు ప్రమాదకరంగా మారాయి. బ్రాండెట్‌ వాటి కంటే మెరుగైన ప్యాకింగ్‌ చేసి అందులో ఉన్న పదర్ధాలను మాత్రం నాసిరకంగా తయారు చేసి మార్కెట్‌లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. నూనె మొదలు మసాలాల వరకు అన్నీ కల్తీ వస్తువులనే ఉపయోగిస్తుండడంతో వాటిని చిన్న చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు.

జీరో వ్యాపారం

హైదరాబాద్‌, తూర్పుగోదావరి, అనంతపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి నిత్యం చిరుతిళ్లు(స్నాక్స్‌) ప్యాకెట్లు జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. ఇక్కడ హోల్‌సేల్‌ వ్యాపారులు జిల్లాలో ఉన్న వేలాది దుకాణాలకు వీటిని విక్రయిస్తున్నారు. అంతేకాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు కూడా ఇటువంటి ప్యాకెట్లను ఇక్కడ విక్రయిస్తున్నారు. హోల్‌సేల్‌ షాపుల్లో ప్రతీ రోజూ రూ.లక్షల్లో చొప్పున ఏడాదికి రూ.కోట్ల వరకు స్నాక్స్‌ వ్యాపారం జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇంతలా వ్యాపారం జరుగుతుండడంతో చిన్నపాటి కంపెనీలు కూడా పోటాపోటీగా ఆహార పదార్ధాలను నాసిరకంగా తయారు చేస్తూ తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. వీటిపై ఇటు ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులుగానీ, అటు జీఎస్టీ అధికారులుగాని తనిఖీలు చేపట్టకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి నాసిరకం ఆహార పదార్ధాలు విక్రయించే వారిపై చర్యలు చేపట్టి చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

నాసిరకం తినుబండారాల అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు ఆకర్షణీయంగా ఉన్న ఈ ప్యాకెట్లను చూసి కొనుక్కొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. చాలా పాఠశాలలు, వీధుల్లో ఉన్న చిరు దుకాణాల వద్ద నాసిరకం పదార్ధాలను విక్రయిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల మీద ప్రేమతో వాటిని కొని ఇస్తున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఇప్పటికై నా ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి.

– పర్రి కృష్ణమూర్తి,

ఉప విద్యాశాఖాధికారి, పాలకొండ

నాసిరకం చిరుతిళ్ల వల్ల చిన్నారులు త్వరగా అనారోగ్యం పాలవుతారు. కడుపు నొప్పితో పాటు ఇన్‌ఫెక్షన్లు బారిన పడటం ఖాయం. ఒక్కోసారి ఫుడ్‌ పాయిజన్‌ జరిగి తీవ్ర స్థాయిలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.త ల్లిదండ్రులు నాసిరకం తినుబండారాలను పిల్లలకు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.

– డాక్టర్‌ జె.రవీంద్రకుమార్‌,

చిన్న పిల్లల వైద్య నిపుణులు

పార్వతీపురం మన్యం జిల్లాలో 1504 సర్కారు బడులు, 150 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 95,658 మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో 3–6 ఏళ్లలోపు చిన్నారులు సుమారు 40 వేల మంది ఉన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రతీ వీధిలో కూడా చిన్నపాటి దుకాణాలలో చిరుతిళ్లను(స్నాక్స్‌) విక్రయిస్తున్నారు. వీరంతా హోల్‌సేల్‌ వ్యాపారుల దగ్గర లోకల్‌ ప్యాకింగ్‌లతో నాసిరకంగా తయారైన చిరుతిళ్ల ప్యాకెట్లను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. నిత్యం పిల్లలు వీధుల్లో ఉండే బడ్డీ కొట్టులలో దొరికే నాసిరకం స్నాక్స్‌ తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు వ్యాపారులు కాల పరిమితి ముగిసిన స్నాక్స్‌ కూడా యఽథేచ్ఛగా విక్రయిస్తూ పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.

మీ పిల్లలు అడిగిన వెంటనే వారి అల్లరిని చూసి తినుబండారాలు(స్నాక్స్‌) కొంటున్న తల్లిదండ్రులు ఆ ప్యాకెట్ల పైన ఉన్న వివరాలను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్యాకెట్లపై ఐఎస్‌ఓ మార్క్‌, తయారీ తేదీ, బెస్ట్‌ బిఫోర్‌ తేదీలను చూడాలని పేర్కొంటున్నారు. అలాగే ప్యాకెట్‌పై బ్యాచ్‌ నంబర్‌, కంపెనీ వివరాలు పక్కాగా ఉండాలి. ఇటువంటి వివరాలు లేకపోతే ఆ ప్యాకెట్లు కొనుగోలు చేయవద్దని, వెంటనే సమీపంలో ఉన్న రెవెన్యూ అధికారులకు లేదా ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులకు సమాచారం ఇచ్చి నాసిరకం స్నాక్స్‌ అమ్మకాలను అరికట్టవచ్చునని అధికారులు చెబుతున్నారు.

రోజు వారీ రూ.లక్షల్లో.. ఏడాదిలో రూ.కోట్లలో వ్యాపారం

కోరి తెచ్చుకుంటున్న జబ్బులు

నాసిరకం వస్తువులతో చిరుతిళ్ల తయారీ

ముప్పు తప్పదంటున్న వైద్యులు

ఆహార కల్తీ నియంత్రణ అధికారులు దృష్టి సారిస్తే మేలు

డేంజర్‌ స్నాక్స్‌..! 1
1/3

డేంజర్‌ స్నాక్స్‌..!

డేంజర్‌ స్నాక్స్‌..! 2
2/3

డేంజర్‌ స్నాక్స్‌..!

డేంజర్‌ స్నాక్స్‌..! 3
3/3

డేంజర్‌ స్నాక్స్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement