సర్పంచ్‌ అభ్యర్థుల పరస్పర దాడులు | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ అభ్యర్థుల పరస్పర దాడులు

Nov 18 2026 2:13 AM | Updated on Nov 18 2026 2:13 AM

సర్పంచ్‌ అభ్యర్థుల పరస్పర దాడులు

నూజెండ్ల: మండల పరిధిలోని వి.అప్పాపురం నామినేషన్‌ కేంద్రం వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటంతో ఘటనలో నలుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. మారెళ్లవారిపాలెం గ్రామంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయి సర్పంచ్‌ పదవికి పోటీ పడ్డారు. ఒక వర్గానికి సర్పంచ్‌ అభ్యర్థిగా కంచుమాటి తిరిపాలు నామినేషన్‌ వేయగా, రెండో వర్గం తరఫున వైఎస్సార్‌ సీపీ నాయకుల సహకారంతో పచ్చా నాసరయ్య బరిలో నిలిచారు.

ఈ క్రమంలో నామినేషన్‌ ప్రక్రియ చివరి రోజున వార్డు అభ్యర్థుల విషయంలో వాగ్వివాదం జరిగింది. అది కాస్తా పెద్దది కావటంతో ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. దాడుల్లో కంచుమాటి తిరిపాలుకు, మరో వర్గానికి చెందిన సర్పంచ్‌ అభ్యర్థి పచ్చా నాసరయ్య, కొర్రపాటి ప్రసాద్‌, శ్రీకాంత్‌లకు గాయాలైనట్లు ఇరువర్గాలకు చెందిన వారు తెలిపారు.

అనంతరం గ్రామానికి చేరుకున్న ఎస్‌ఐ కృష్ణారావు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని, ఇరువర్గాలను విచారణ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిణామాలతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement