పోలీసుస్టేషన్‌ను సందర్శించిన ఏఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పోలీసుస్టేషన్‌ను సందర్శించిన ఏఎస్పీ

Nov 18 2026 2:13 AM | Updated on Nov 18 2026 2:13 AM

పోలీసుస్టేషన్‌ను సందర్శించిన ఏఎస్పీ శావల్యాపురం: శావల్యాపురం పోలీసుస్టేషన్‌ను అడిషనల్‌ ఎస్పీ ఎల్‌.శేషాద్రి మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా అడిషనల్‌ ఎస్పీ మాట్లాడుతూ వినుకొండ రూరల్‌ పరిధిలో కొన్ని గ్రామ పంచాయతీలో మాత్రమే స్వల్ప వివాదాలు జరిగాయని పోలీసులు తక్షణమే స్పందించి పార్టీలకతీతంగా ప్రతి అభ్యర్థి నామినేషన్‌ వేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఏకగ్రీవాలకు తావు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజా మద్దతుతో ఏకగ్రీవాలు అయ్యే గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకులను స్వాగతిస్తామన్నారు. ప్రలోభాలు, భయభ్రంతులు, అధికార ఒత్తిళ్లతో జరిగే ఏకగ్రీవాలపై ప్రత్యేక నిఘా ఉంచామని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే అటువంటి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చారించారు. బలవంతంగా నామినేషన్లు ఉపసంహించుకునేలా ఒత్తిడి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఈనెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ప్రజలందరు పోలీసులకు సహకరించాలన్నారు. ఆయన వెంట ఎస్సై మోర్ల వెంకటేష్‌బాబు ఉన్నారు. పశర్లపాడు సర్పంచ్‌ పదవికి వేలంపాట బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించండి జిల్లా మలేరియా అధికారిగా భూపతిరావు

రెంటచింతల: మండలంలోని పశర్లపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవిని ఓసీ మహిళకు కేటాయించారు. ఏకగ్రీవం చేయడానికి గ్రామ పెద్దలు కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నేతలు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. మంగళవారం రాత్రి గ్రామ పెద్దలు మరో ప్రయత్నించారు. శిథిలమైన బ్రహ్మం గారి ఆలయం పునర్నిర్మాణానికి ఎవరు ఎక్కువ విరాళం ఇస్తే వారికి సర్పంచ్‌ పదవి ఇచ్చేలా తీర్మానం చేశారు. బహిరంగ వేలంపాట పెట్టారు. నలబిరుదు లక్ష్మి రూ.71.50 లక్షలకు పదవిని కై వసం చేసుకున్నారు. గ్రామంలో మొత్తం 2,470 మంది ఓటర్లు ఉండగా కేవలం 1,400 మంది ఓటర్లుకు మాత్రమే రూ.500 చొప్పున పంపిణీ చేయడానికి గ్రామ కమిటీ సిద్ధమైనట్లు సమాచారం.

నరసరావుపేట: బాల్యవివాహాల కేసుల్లో గుర్తించిన, రక్షించిన పిల్లలను ఎలాంటి ఆలస్యం లేకుండా బాలల సంక్షేమ కమిటీ ఎదుట హాజరుపరచాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన పల్నాడు జిల్లాలో బాలల సంక్షేమ కమిటీ త్రైమాసిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. బాల కార్మిక వ్యవస్థ, బాలల భిక్షాటన నివారణకు క్రమం తప్పకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులు, బాలల సంక్షేమ కమిటీ పనితీరు, సంరక్షణ, రక్షణ అవసరమైన పిల్లల సంక్షేమ పరిస్థితులను సమీక్షించారు. బాలల సంక్షేమ కమిటీ సభ్యుడు బి. రవికుమార్‌ త్రైమాసిక పనితీరు నివేదికను సమర్పించారు. బాలల సంరక్షణ కేంద్రాలను సందర్శించి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ప్రస్తుతం 258 మంది పిల్లలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యేక దత్తత సంస్థలో నలుగురు పిల్లలు, బాలసదనంలో ఒక బాలిక దత్తతకు అర్హులుగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలను గుర్తించి ఓపెన్‌ షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి, కన్వీనర్‌ ఉమామహేశ్వరి, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు నాగ తులసమ్మ, అనురాధ, బి. రవికుమార్‌, భూలక్ష్మయ్య, ఇతర కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నరసరావుపేట టౌన్‌: పల్నాడు జిల్లా మలేరియా అధికారిగా ఎం.భూపతిరావు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ సీహెచ్‌ రత్నమన్‌మోహన్‌ చేతులమీదుగా నియామాకపత్రం అందుకున్నారు. భూపతిరావు గతంలో మాచర్లలో అసిస్టెంట్‌ మలేరియా అధికారిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. జిల్లాలో మలేరియా నివారణకు తనవంతు కృషి చేస్తానని భూపతిరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement