పరాకాష్టకు పచ్చ అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

పరాకాష్టకు పచ్చ అరాచకాలు

Nov 19 2026 2:49 AM | Updated on Nov 19 2026 2:49 AM

గురువారం శ్రీ 19 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 పరాకాష్టకు పచ్చ అరాచకాలు మహిళ కడుపులో కాలితో తన్ని మరీ... మాజీ ఎంపీపీపై కర్రతో తలపై దాడి ఇద్దరు మహిళలు, యువకుడికి తీవ్ర గాయాలు మహిళా అభ్యర్థి భర్త అక్రమ అరెస్టు

న్యూస్‌రీల్‌

పెదకూరపాడు: నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త నంబూరు శంకరరావును పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలపై నామినేషన్‌ కేంద్రాల వద్ద దాడులు జరగడంతో పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి ఆయన బయలుదేరారు. సత్తెనపల్లి మండలం ముప్పాళ్ల గ్రామం వద్ద పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అమరావతి మండలం ఎస్‌ఐ ఆధ్వర్యంలో ముప్పాళ్ల గ్రామం నుంచి గుంటూరుకు తీసుకువెళ్లారు. ఫిర్యాదు చేసేందుకు వెళుతుంటే అక్రమ అరెస్టులు చేయడం దారుణమని నంబూరు శంకరరావు అన్నారు.

మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అరెస్ట్‌

టీడీపీ గూండాల దాడిలో ఆరుగురికి గాయాలు

రెండో విడత పంచాయతీ ఎన్నికల వేళ దాడులు

గురువారం శ్రీ 19 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

● నామినేషన్‌ కేంద్రాల

వద్ద పచ్చ గూండాల తిష్ట

● వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులే

లక్ష్యంగా పేట్రేగిన మూకలు

● అడ్డుకోవాల్సింది పోయి

మద్దతుగా నిలిచిన పోలీసులు

● పలుచోట్ల మహిళలపై కూడా

భౌతిక దాడులు

● ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం

చేసిన కూటమి నేతలు

సాక్షి నెట్‌వర్క్‌: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలి రోజైన బుధవారం కూటమి నేతలు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు, అమరావతి, బెల్లంకొండ, అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లో భయోత్పాతం సృష్టించారు. నామినేషన్‌ కేంద్రాల వద్దకు వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులను రానివ్వకుండా వందల సంఖ్యలో కిరాయి గూండాలను తీసుకొచ్చి ఎక్కడికక్కడ నామినేషన్‌ పత్రాలను చించివేశారు. పోలీసుల కళ్లముందే దారుణాలు జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషించి ప్రజాస్వామ్యానికి పాతర వేశారు.

క్రోసూరు మండలంలో రెండో విడత ఎన్నికలకు సంబంధించి సర్పంచ్‌లు, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజే వైఎస్సార్‌ సీపీ బలపరిచిన ఇద్దరు అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా పోలీసులు, కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. దాడులు చేసి గాయపరిచి అడ్డుకున్న సంఘటనలు మండలంలోని అనంతవరం, ఊటుకూరు గ్రామాల్లో చోటుచేసుకున్నాయి. మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన సర్పంచ్‌ అభ్యర్థి అన్నపురెడ్డి కల్యాణి తన భర్త అంజిరెడ్డితో కలిసి గుంటూరు నుంచి నామినేషన్‌ వేసేందుకు మండలంలోని నాగవరం కేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకున్నారు. అక్కడి జనసేన కార్యకర్తలు వెంటనే వెళ్లిపోవాలని, లేకుంటే కారును ధ్వంసం చేస్తామని బెదిరించారు. పోలీసులతో కుమ్మకై ్క కర్రలు, మారణాయుధాలు తీసుకొచ్చారంటూ ఒక టాటా ఏస్‌ వాహనంలో అవి దొరికాయని చూపిస్తూ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి వెనుదిరిగి అభ్యర్థి అనంతవరం చేరుకుంటుండగా, మార్గమధ్యంలోని హసనాబాద్‌ గ్రామానికి చేరుకోగానే అక్కడి టీడీపీ నాయకులు కారును అడ్డుకుని దుర్భాషలాడి పోలీసులను పిలిపించారు. ఎస్‌ఐ పి. రవిబాబు అక్కడికి చేరుకుని అభ్యర్థి కారును అదుపులోకి తీసుకుని క్రోసూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న అనంతవరం గ్రామస్థులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో ఎస్‌ఐ తన పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను దుర్భాషలాడుతూ లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. సీతారావమ్మ అనే మహిళను లాఠీతో కొట్టి, కాలితో కడుపులో తన్నారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై కిందపడిపోయారు. వెంటనే ఆమెను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రురాలిని పరామర్శించారు. పోలీసుల దౌర్జన్యాలను ఖండిస్తూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

క్రోసూరు మండలంలోని ఊటుకూరుకు చెందిన వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థి రంగా సింగారయ్యకు మద్దతుగా నిలిచేందుకు మాజీ ఎంపీపీ పెరుమాళ్లపల్లి కోటయ్య బయ్యవరం నామినేషన్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడ బయ్యవరం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు, ఊటుకూరు టీడీపీ నాయకురాలు వేగుంట రాణి, జనసేన నాయకుడు శాఖమూరి శ్రీనివాసరావు ప్రోద్బలంతో నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారు. కోటయ్యపై కర్రలతో దాడి చేసి తరిమేశారు. మాజీ ఎంపీపీ కోటయ్య తలపై కర్రతో కొట్టడంతో తీవ్ర గాయమైంది. ఆయన సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో మండలంలో తొలిరోజు వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు వేసేందుకు వెళ్లలేకపోయారు.

అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామంలో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి కొంపెర్ల రోశయ్య తమ వార్డు సభ్యులతో కలిసి నామినేషన్‌ వేసేందుకు బయలుదేరారు. ఇంతలో టీడీపీ గూండాలు ఒక్కసారిగా రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడిలో చిలక ఆదాం, ప్రియాంక, తాళ్లూరి మరియమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. రాళ్ల దాడితో ఎస్సీ సామాజిక వర్గీయులు పరుగులు పెట్టారు.

పెదకూరపాడు మండలం లింగంగుంట గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ మహిళా అభ్యర్థి భర్త ఎండ్లూరి నాగమల్లేశ్వరరావు నామినేషన్‌ దాఖలు చేసేందుకు వస్తుండగా పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించారు. పెదకూరపాడు ఎస్‌ఐ సంధ్యారాణి నాగమల్లేశ్వరరావును అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

చింతపల్లి దాడిలో గాయపడిన ప్రియాంక

కంటికి తీవ్ర గాయమైన మరియమ్మ

గాయపడిన చిలక

ఆదాం

బెల్లంకొండ మండలం నందిరాజుపాలెం గ్రామంలో సర్పంచ్‌, వార్డు సభ్యులుగా నామినేషన్లు వేసేందుకు ఎస్సీ మహిళలను తీసుకువస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకుడు దండా సత్యనారాయణరెడ్డిపై పచ్చమూకలు దాడికి తెగబడ్డాయి. చండ్రాజుపాలెం గ్రామంలో సర్పంచ్‌గా నామినేషన్‌ వేసేందుకు వచ్చిన జనసేన పార్టీ మద్దతుదారు, మహిళా అభ్యర్థి ఓర్సు చిన్న రమణపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. నామినేషన్‌ కేంద్రంలో ఆమె వద్ద ఉన్న నామినేషన్‌ పత్రాలను లాక్కొని టీడీపీ నాయకులు చించివేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు.

అమరావతి మండలం దిడుగు నామినేషన్‌ కేంద్రం వద్ద నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ పచ్చమూకల కార్యకర్తలు టెంట్లు వేసి తిష్టవేశారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అమరావతి మండలంలోని రెండు నామినేషన్‌ కేంద్రాలైన దిడుగు, మునగోడు కేంద్రాల వద్ద 400 మందికి పైగా టీడీపీ శ్రేణులు కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో కాపలా కాశారు. ఉదయం 10 గంటలకు గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి గణపా మస్తానమ్మ తన వార్డు సభ్యులు, అనుచరులతో కలిసి గ్రామంలోని సచివాలయంలో నామినేషన్‌ వేసేందుకు బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకుని నిలిపివేశారు. ఈ క్రమంలో నాయకులకు, పోలీసులకు పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యకర్తలు, నాయకులు మధ్యాహ్నం 3 గంటల వరకు రోడ్డుపై బైఠాయించారు. సుమారు మూడున్నర గంటల సమయంలో నామినేషన్‌ గడువు ముగిసిపోతుండటంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నామినేషన్‌ వేసేందుకు సచివాలయం వైపు కదిలివెళ్లారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా రాళ్లు, కర్రలు, పెట్రోల్‌ సీసాలతో దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్‌ సీపీకి చెందిన గ్రామ మాజీ సర్పంచ్‌ బంకా వెంకటరావు (విష్ణు) తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. అలాగే సింగం మహేష్‌రెడ్డి, గఱపా బారారెడ్డి, గువ్వల మోహనరెడ్డి, ఫేక్‌ మసూద్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ గుంటూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు 144 సెక్షన్‌ విధించి పికెట్‌ ఏర్పాటు చేశారు.

పల్నాడు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రారంభం రోజే కూటమి నాయకులు, పోలీసులు దుర్మార్గాలకు తెగబడ్డారు. రెండున్నరేళ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిన కూటమి నేతలు ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం లేక అడ్డదారిలో గెలిచేందుకు యత్నిస్తున్నారు. దీనికోసం దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతున్నారు. నామినేషన్లను కూడా అడ్డుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement