డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవరెడ్డి అక్రమ హౌస్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవరెడ్డి అక్రమ హౌస్‌ అరెస్ట్‌

Nov 19 2026 2:49 AM | Updated on Nov 19 2026 2:49 AM

నరసరావుపేట: సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవరెడ్డిని అక్రమ హౌస్‌ అరెస్టు చేశారు. ఈ మేరకు నరసరావుపేటలో పోలీసులు నోటీసు అందజేశారు. రెండో ఫేజ్‌ పంచాయతీ ఎన్నికలు సత్తెనపల్లి డివిజన్‌లో జరుగుతుండగా తనను పోలీసులు అక్రమ అరెస్టు చేశారని పేర్కొన్నారు. కూటమి నాయకులు ఓటమి భయంతో నామినేషన్లను అడ్డుకోవడం, తిరస్కరించడం, అభ్యర్థులను బెదిరించడం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన అవసరం ఉండగా ప్రజల పక్షాన నిలబడే నాయకులను ఇలా నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నిస్తున్నామన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసు వ్యవస్థను ఉపయోగించి ప్రజాస్వామ్య గొంతుకలను అణచివేయడం ఇకనైనా ఆపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement