‘పుర’ నామినేషన్లలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

‘పుర’ నామినేషన్లలో ఉద్రిక్తత

Nov 18 2026 2:13 AM | Updated on Nov 18 2026 2:13 AM

వైఎస్సార్‌ సీపీ 14వ వార్డు అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ దీనిని వ్యతిరేకిస్తూ నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి తొలుత నామినేషన్‌కు ఓకే చెప్పిన అధికారులు టీడీపీ నాయకుల సూచన మేరకే తిరస్కారం జరిగిందన్న మాజీ ఎమ్మెల్యే ఆర్డీఓ అప్పీలుకు వెళ్తామంటూ ప్రకటన

నరసరావుపేట: నరసరావుపేట పురపాలక సంఘం ఎన్నికల ప్రక్రియ మంగళవారం ఉద్రిక్తతల నడుమ ముగిసింది. సోమవారం వరకు నిర్వహించిన ప్రక్రియలో 21మంది చైర్‌పర్సన్‌ అభ్యర్థులు, 337మంది వార్డు కౌన్సిలర్ల పోస్టులకు నామినేషన్లు దాఖలు చేసిన విషయం విధితమే. పరిశీలన కార్యక్రమంలో 14వ వార్డుకు చెందిన చింతా వెంకటవీరమ్మ నామినేషన్‌ను తిరస్కరించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఆయనను చాలా సేపు కేంద్రంలోనికి వెళ్లనీయకుండా పోలీసులు ఆపారు. అనంతరం లోపలికి వెళ్లి అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి, కమిషనర్‌ బి.రమ్యకీర్తనను నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించారని అడిగారు. ఓటరు కార్డులో వీరమ్మ లక్ష్మీశెట్టి అనే పేరు ఉండగా ఆధార్‌ కార్డులో చింతా వెంకట వీరమ్మ అని ఉందని, నామినేషన్‌లో సైతం చింతా వెంకట వీరమ్మ పేరుతో దాఖలు చేశారని, పేరులో తేడా కారణంగా నామినేషన్‌ తిరస్కరించామని కమిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై డాక్టర్‌ గోపిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం బయట మీడియాతో మాట్లాడుతూ తొలుత నామినేషన్‌ బాగానే ఉందని అభ్యర్ధుల నుంచి సంతకాలు తీసుకున్న తర్వాత ఆమె నామినేషన్‌ తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించటం జరిగిందన్నారు. ఇది కేవలం ఆ వార్డు టీడీపీ నాయకుడు వాసిరెడ్డి రవీంద్ర కోరిక మీదటే కమిషనర్‌ తిరస్కరించారన్నారు. నామినేషన పత్రాలు చూపించమంటే అధికారులు చూపించడం లేదన్నారు. ఆర్‌డీఓ దగ్గర అప్పీలు చేస్తామని ప్రకటించారు. ఒకవేళ నామినేషన్‌ తిరస్కరించటం జరిగితే అదే సామాజికవర్గానికి చెందిన మరో మహిళ నామినేషన్‌ వేయటం జరిగిందని, ఆమెకు బీఫామ్‌ ఇచ్చి పోటీలో నిలబెడతామని ప్రకటించారు. కాగా, నామినేషన్‌ కేంద్రమైన మున్సిపల్‌ కార్యాలయంలో విడతలవారీగా నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. గంటకు ఎనిమిది వార్డుల చొప్పున ఉదయం 11గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు పరిశీలన చేశారు. పలు పార్టీల అభ్యర్ధులు, ఇండిపెండెంట్లు, వారి ప్రతిపాదకులతో పాటు వారి న్యాయవాదులు కూడా పరిశీలనలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement