ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి

Nov 15 2026 8:29 PM | Updated on Nov 15 2026 8:29 PM

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి

డీఎస్‌వో ఎంవీ ప్రసాద్‌

చిలకలూరిపేట: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్‌ స్పష్టం చేశారు. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో రైస్‌ మిల్లర్లు, రిటైల్‌ షాపుల యజమానులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బియ్యం రకాల వారీగా ప్రభుత్వ నిర్ణయించిన గరిష్ట రిటైల్‌ విక్రయ ధరలను వ్యాపారులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నాణ్యమైన బియ్యం కోరుకొనే వినియోగదారులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం బియ్యాన్ని విక్రయించాలన్నారు. ఇతర రకాల బియ్యాన్ని కూడా నిర్ణీత ధరలకే అమ్మాలన్నారు. బీపీటీ–3291(సోనా) రకం రూ.66కు, బీపీటీ–5204 (సాంబా) రూ.66, కేఎన్‌ఎం రూ.66కు, హెచ్‌ఎంటీ రూ.76కు, ఆర్‌ఎన్‌ఆర్‌ రూ.76కు, జై శ్రీరామ్‌ రూ.82కు, ఎంటీయూ సాధారణ రకాలు రూ.47కు విక్రయించాలన్నారు. ప్రతి బియ్యం దుకాణంలో రకాల వారీగా ధరల పట్టికను ప్రదర్శించాలని చెప్పారు. ప్యాకింగ్‌ చేసిన బియ్యం సంచులపై నిర్ణీత ధరలు ముద్రించాలన్నారు. వినియోగదారుల నుంచి అధిక ధరలకు బియ్యం విక్రయించినట్లు ఫిర్యాదులు అందితే సంబంధిత వ్యాపారులపై తగు చర్యలు తీసు కుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, కన్జ్యూమర్‌ రైట్‌ ప్రొటెక్షన్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్‌, మండల విజిలెన్స్‌ కమిటీ సభ్యులు రవినాయక్‌, బేబీ విక్రమ్‌, హోల్‌సేల్‌, రిటైల్‌ సంఘాల నాయకులు రామలింగేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement