గుంటూరు మెడికల్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ జూడాల సంఘం ఆధ్వర్యంలో మౌనం పాటిస్తూ తమ సమ్మెల కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె శనివారానికి ఆరో రోజుకు చేరుకుంది. ఎలాంటి నినాదాలు లేవు, ప్రదర్శనలు లేవు. బదులుగా మౌనంగానే నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు, పోరాటం పట్ల తమ నిబద్ధత ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తగిన కార్యాచరణను రూపొందించడంపై జూడాల సంఘం ప్రతినిధులు, సభ్యుల మధ్య సంప్రదింపులు జరిగినట్లు వెల్లడించారు. నినాదాలు చేయకుండా జూనియర్ డాక్టర్లు మౌనంగా కూర్చుని తమ నిరసన తెలియజేశారు. స్టైఫండ్ పెంచే వరకు తమ సమ్మె విరమించమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గుంటూరు మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యు. ఈశ్వర్ శంకర్, వైస్ ప్రెసిడెంట్స్ ఎ.వి. కృష్ణచౌదరి, కె. ప్రసన్న ఆదిలక్ష్మి, షేక్ సోహిల్ అలీ, జనరల్ సెక్రటరీలు జగదీష్ గాదె, పి.ఎస్.వి. కల్యాణి, విఘ్నేష్ ఆపతి, కోశాధికారులు జేత్ర మర్రిపాటి, అనురాగ్, జాయింట్ సెక్రటరీలు బి. వంశీకృష్ణ, బి. స్నేహసాహిత్య, జి. రాధిక, కునపవర్ కార్తీక్, నిషిరాగ్ బికుంతె, పి. సందీప్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎన్. సాయిప్రదీప్, ఉదయ్‌సాగర్, సాయిప్రదీప్, తరుణ్‌కుమార్, హేమంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.6,500, గరిష్ఠ ధర రూ.10,200, మోడల్ ధర రూ.8,400 వరకు పలికింది.


