సత్తెనపల్లి: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్ దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ జానీ అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఆత్మహత్యకు సీఐ శ్రీరామ్ వెంకట్రావు కారణమంటూ దరియా హుస్సేన్ మరణ వాంగ్మూల లేఖలో పేర్కొన్నారని, దరియా హుస్సేన్ ఆత్మహత్యకు కారకుడైన సీఐ శ్రీరామ్ వెంకట్రావు పై వెంటనే శాఖా పరమైన చర్యలు తీసుకోవాల న్నారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి మాట్లాడుతూ దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకోవడానికి సీఐ శ్రీరామ్ వెంకటరావు కారణమని, సివిల్ కేసు కోర్టులో ఉండగా దరియా హుస్సేన్‌ను రోజు పోలీస్‌స్టేషన్‌కు పిలిచి చిత్రహింస లకు గురి చేశారన్నారు. చిత్రహింసలు తట్టుకోలేకనే దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సీఐ శ్రీరామ్ వెంకట్రావు పై శాఖాపరమైన చర్యలు తీసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ మాబూ హుస్సేన్, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గోర, మైనార్టీ సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ ఖాసిం, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు షేక్ ముక్త్యార్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ బాషా, నాయకులు షేక్ మహిబ్, అలీ ఆజాం, తదితరులు ఉన్నారు.
దరియా హుస్సేన్ కుటుంబానికి పరామర్శ
పిడుగురాళ్ల: పోలీసుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న దరియా హుస్సేన్ కుటుంబాన్ని గురువారం ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనార్టీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ మహ్మద్ ఫార్కూ షుబ్లీ పరామర్శించారు. దరియా హుస్సేన్ భార్య అమిరుషా బేగం, కుమారులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటామని, అండగా ఉంటామని ఆయన చెప్పారు. ఆయన వెంట ముస్లిం పెద్దలు పలువురు పాల్గొన్నారు.
దరియా హుస్సేన్ ఆత్మహత్యపై కేసు
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణంలో షేక్ దరియా హుస్సేన్ పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. అయితే ఈ కేసులో దరియా వలి భార్య అమిరునిషాబేగం ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అమిరునిషా బేగంకు ఇల్లు అమ్మిన పులుకూరి లక్ష్మీ, ప్రశాంత్‌ల వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేయటంతో దాచేపల్లి సీఐ ఖాజావలి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ ఎం. మోహన్‌తెలిపారు.


