ప్రకృతి వ్యవసాయ విధానం మేలు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయ విధానం మేలు

Jul 11 2026 3:34 AM | Updated on Jul 11 2026 3:34 AM

నార్నెపాడు(ముప్పాళ్ల): ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా సాగు మేలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కే.అమలకుమారి పేర్కొన్నారు. మండలంలోని నార్నెపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసిన పంటలను జర్మనీకి చెందిన రీనట్‌–పిక్‌ ప్రాజెక్ట్‌ ప్రతినిధి టీమ్‌హెక్మన్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. పీఎమ్‌డీఎస్‌–సీసీఈ విధానంలో సాగును పరిశీలించి, 5/5 మీటర్ల ప్లాట్‌లో నమోదైన 28 కిలోల బయోమాస్‌తోపాటు పరిశోధన డేటా సేకరణ, నమోదు విధానాన్ని జర్మనీ ప్రతినిధికి వివరించారు. విత్తన గుళికలు, విత్తన బంతుల తయారీ విధానం, వాటి ప్రయోజనాలను వివరించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు ప్రకృతి వ్యవసాయంలో విత్తన గుళికల ప్రాధాన్యతను వివరించారు. బీజామృతం తయారీ విధానాన్ని రైతు శాస్త్రవేత్త ఉమామహేశ్వరి వివరించారు. ఇన్‌ఫ్రారెడ్‌, ధర్మామీటర్‌, 3ఇన్‌1 మీటర్‌ ద్వారా నేల ఉష్ణోగ్రత, తేమ, పీహెచ్‌ విలువను ప్రదర్శించి, ప్రకృతి వ్యవసాయం–సాంప్రదాయ వ్యవసాయం మధ్య ఉన్న తేడాలను వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ రవిబాబు, ఏఓ శ్రీధర్‌రెడ్డి, వీఏఏలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతు శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement