ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి బాధ్యతల స్వీకారం | - | Sakshi
Sakshi News home page

ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి బాధ్యతల స్వీకారం

Jul 12 2026 3:17 AM | Updated on Jul 12 2026 3:17 AM

ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి బాధ్యతల స్వీకారం

నరసరావుపేట రూరల్‌: జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్‌)గా రోహిత్‌కుమార్‌ చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. 2022 బ్యాచ్‌కు చెందిన రోహిత్‌కుమార్‌ చౌదరి గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. తాడిపత్రిలో ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై జిల్లాకు వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన జేవీ సంతోష్‌కు ఎస్పీగా ఉద్యోగోన్నతి లభించింది. ఇదిలా ఉండగా డిప్యూటేషన్‌పై సీబీఐకు వెళ్తున్న జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు శనివారం రిలీవ్‌ అయ్యారు. జేవీ సంతోష్‌కు ఇన్‌చార్జ్‌ ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement