విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
మా తాతముత్తాల నుంచి పశువుల కోసం ఉపయోగించుకుంటున్న భూమిని ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న సైదారావు పై, అలాగే సహకరించిన రెవెన్యూ ఉద్యోగుల పై చర్యలు తీసుకోవాలి. లేకుంటే రైతులందరితో కలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.
– పేర్ల అంకయ్య, స్థానికుడు
తాళ్ళపల్లి గ్రామంలో రిజిస్ట్రేషన్ భూమిని రామిశెట్టి సైదారావు, మన్నెంకుంట శ్రీదేవిల పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదైన విషయం నా దృష్టికి వచ్చింది. రీ సర్వేలో జరిగిన పొరపాటు.. లేకుంటే ఇతర కారణాలపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం.
– బి.కిరణ్ కుమార్, తహసీల్దార్


