న్యూస్‌రీల్
మామూళ్ల మత్తులో అధికారులు!
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
పులిచింతల సమాచారం
సాగర్ నీటిమట్టం వివరాలు
పల్నాడు
తాళ్లపల్లిలో ఏడు ఎకరాలకు పైగానే పొలం ఆక్రమణ
● సమాధుల భూముల్లోనూ పాగా
● రిజిస్ట్రేషన్ భూములనూ వదలని
టీడీపీ నేత రామిశెట్టి సైదారావు
● మామూళ్లతో అధికారులతో దోస్తీ
● ఆ టీడీపీ నేతపై సొంత పార్టీలోనే
ఆగ్రహావేశాలు
● న్యాయం చేయకుంటే కలెక్టర్‌ను కలిసేందుకు సిద్ధమంటున్న గ్రామస్తులు
7
మాచర్ల రూరల్: అధికారమే అండగా అధికార పార్టీ నాయకుల అక్రమాలు, ఆక్రమణలు, దందాలు రోజు రోజుకి అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. ప్రభుత్వ రెవెన్యూ భూములను ఆక్రమించుకోవటమే కాకుండా చివరికి గ్రామ ప్రజల చొప్ప దొడ్డి, పశువుల పాకలకు ఉపయోగించుకునే భూములనే కాకుండా తమ పూర్వీకుల సమాధులు నిర్మించుకున్న భూములను సైతం ఆక్రమించుకొని రూ.కోటికి పైగా విలువైన భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, విక్రయాలు జరుపుతున్న టీడీపీ మండల నాయకుడి వైనం వెలుగులోకి వచ్చింది. మాచర్ల మండలంలోని తాళ్ళపల్లి గ్రామంలోని 351, 352 సర్వే నెంబర్‌లో గల ఏడు ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ భూములను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రామిశెట్టి సైదారావు 4.40 ఎకరాలు తన అత్త మన్నెంకుంట శ్రీదేవి పేరుపై, 2.50 ఎకరాలు, మిగిలిన భూమిని ఇతరులపై దర్జాగా ఆన్‌లైన్‌లో ఎక్కించుకొని రిజిస్ట్రేషన్ సైతం చేయించుకుని మార్కెట్‌లో విక్రయించుకునేందుకు సిద్ధమయ్యాడు.
తాళ్ళపల్లి గ్రామం ఏర్పడిననాటి నుంచి వందేళ్లకు పైగా ఏడు ఎకరాల భూమిని గ్రామస్తులు తమ పశువుల కొట్టాలకు, గడ్డివాములు ఏర్పాటు చేసుకునేందుకు అదే గ్రామానికి చెందిన రైతు నుంచి కటకం శ్రీనివాసరావు 6సెంట్లు, పేర్ల అంకయ్య 9 సెంట్లు, పీరసాల అంజయ్య, కొండా చౌడయ్య, కటకం లక్ష్మినారాయణ, యడవల్లి కొండయ్య, సంపత్తి సైదారావు, పొర్లు అశోక్, కడియం రమేష్, కొండా మల్లయ్య, చింతా నాగేశ్వరరావు, కటకం శ్రీనివాసరావు, తదితర రైతులు తలా పది సెంట్లు చొప్పున కొనుగోలు చేసి తాత ముత్తాల నుంచి కొట్టాలకు, పశువుల పాకలకు ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా కటకం శ్రీనివాసరావు, కటకం లక్ష్మీనారాయణలు ఈ స్థలంలో తమ తల్లిదండ్రుల సమాధులను ఏర్పాటు చేసుకొని ప్రతి ఏటా పూజలు నిర్వహించుకుంటున్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్ కలిగిన స్థలాన్ని సైతం సదరు టీడీపీ నాయకుడు రామిశెట్టి సైదారావు దర్జాగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని విక్రయాలు జరపటం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారముందని అధికారులను మభ్యపెట్టి గ్రామ రైతుల భూములను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుంటుంటే గ్రామ వీఆర్‌ఓ, సర్వేయర్లు మామూళ్ల మత్తులో రిజిస్ట్రేషన్ భూములు సైతం సైదారావు కుటుంబ సభ్యుల పేర్లతో నమోదు చేయటంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ నడిబొడ్డున ఉన్న రిజిస్ట్రేషన్ భూములకే రక్షణ లేకపోతే ఇక గ్రామ శివారులోని సాగు భూముల పరిస్ధితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామ రెవెన్యూ రికార్డులను నిత్యం పరిశీలించి గ్రామంలో సంచరించే వీఆర్‌ఓ, సర్వేయర్లకు ఆక్రమిత భూములు రిజిస్ట్రేషన్ భూములని తెలియదా? తెలిసి కూడా అక్రమంగా ఆన్‌లైన్‌లో ఎక్కించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నిస్తున్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ 31.1220 టీఎంసీలు. ప్రాజెక్టుకు 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 3000 క్యూసెక్కులు వదులుతున్నారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 513.70 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.


