విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పది పబ్లిక్ పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. పరీక్ష కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాలలో మౌలిక వసతులు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, విద్యుత్ సదుపాయం వంటి సదుపాయాలు కల్పిస్తున్నాం. పరీక్ష కేంద్రాలను నో సెల్‌ఫోన్ జోన్‌లు గుర్తించాం. ఎవరూ పరీక్ష కేంద్రాలలోకి ఫోన్‌లు తీసుకవెళ్లేందుకు అనుమతి లేదు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పరీక్షలను విజయవంతం చేసేందుకు సహకారం కోరాం. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. –పీవీజే రామారావు, డీఈఓ


